కీపర్‌ రాకెట్‌ త్రోకు దిమ్మతిరిగింది

14 Sep, 2020 10:57 IST|Sakshi

చెస్టర్‌ లీ స్టీట్‌:  ఇంగ్లండ్‌లో జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్‌ టీ20 లీగ్‌లో దుర్హామ్‌ వికెట్‌ కీపర్‌ ఫర్హాన్‌ బెహర్డియన్‌ విసిరిన అద్భుతమైన త్రోకు లీసెస్టర్‌షైర్‌ కెప్టెన్‌ కొలిన్‌ అకర్‌మ్యాన్‌కు దిమ్మతిరిగింది. నాన్‌స్టైకర్‌ ఎండ్‌వైపు రాకెట్‌ వేగంతో విసిరిన ఆ త్రో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయయింది.  లీసస్టర్‌షైర్‌ తొలుత బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఇన్నింగ్స్‌ 9 ఓవర్‌ రెండో బంతికి అకర్‌మ్యాన్‌ రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. బంతిని హిట్‌ చేసి పరుగు కోసం యత్నించే సమయంలో రనౌట్‌ అయ్యాడు. 

కాగా, అప్పటికే బంతిని పట్టుకున్న కీపర్‌ బెహర్దియన్‌..  ఆ బంతిని వేగంగా నాన్‌స్టైకర్‌ ఎండ్‌ వైపు ఉన్న వికెట్లపైకి విసిరాడు. అంతే అకర్‌మ్యాన్‌ క్రీజ్‌లోకి చేరేలోపే వికెట్లు ఎగిరిపడటంతో భారంగా పెవిలియన్‌కు చేరాడు.  అకర్‌మ్యాన్‌ పది పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో దుర్హామ్‌ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లీసెస్టర్‌షైర్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఆ తర్వాత 131 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన దుర్హామ్‌ జట్టు 15. 2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు