Asia Cup 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్‌ కొట్టేశాడు!

24 Aug, 2022 16:16 IST|Sakshi

టీమిండియా యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ను ఆసియాకప్‌కు స్టాండ్‌బైగా బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టాండ్‌బైగా ఉన్న చాహర్‌ను ప్రధాన జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై భారత సెలక్టర్లు రానున్న 24 గంటల్లో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

కాగా గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన చాహర్‌.. తిరిగి జింబాబ్వే సిరీస్‌తో అద్భుతమైన పునరాగమనం చేశాడు.ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన చహర్‌ 5 వికెట్లతో అదరగొట్టాడు. ఇక ఆసియాకప్‌ కోసం భారత జట్టు ఇప్పటికే యూఏఈకు చేరుకుంది.

ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ బౌలర్‌ లక్ష్మీపతి బాలాజీ స్పందిస్తూ.."చాహర్‌ ఆసియాకప్‌ ప్రధాన జట్టలోకి చేరడం ఖాయం. అతడు కొంత కాలం ఆటకు దూరమైన తన రిథమ్‌ను ఏ మాత్రం కోల్పోలేదు. చాహర్‌ పవర్‌ ప్లేలో ఒకట్రెండు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన శుభారంభం అందించగలడు. కాబట్టి టీ20 ఫార్మా్‌ట్‌కు జట్టును ఎంపిక చేసే ముందు అతడిని ప్రాధాన ఎంపికగా భావించాలి. అయితే ప్రస్తుతం భారత జట్టులో చాలా మంది బౌలర్లు ఉన్నారు.

కానీ వారిలో కొత్త బంతితో వికెట్లు తేసే సత్తా ఎవరుకి ఉందో వారికే అవకాశం ఇవ్వాలి. జట్టుకు బుమ్రా, షమీ వంటి ఆటాకింగ్‌ బౌలర్లు అందుబాటులో లేకపోతే చాహర్ వాళ్ల స్థానాన్ని భర్తీ చేయగలడు" అని పేర్కొన్నాడు. ఇక ఆసియాకప్‌-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా జరగనుంది. టీమిండియా విషయానికి వస్తే.. తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.

ఆసియాకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్
స్టాండ్‌బై ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్
చదవండి: IND Vs PAK: ఇటు బుమ్రా.. అటు షాహిన్; లోటును భర్తీ చేసేది ఎవరు?

మరిన్ని వార్తలు