కోచ్ కాదు కామాంధుడు.. మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులు 

8 Sep, 2021 16:28 IST|Sakshi

చెన్నై: శిక్షణ ఇవ్వాల్సిన ఓ కోచ్‌ కామంతో కళ్లు మూసుకుపోయి, మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన అథ్లెటిక్స్ కోచ్‌ పి. నాగరాజన్‌పై ఓ జాతీయ స్థాయి మహిళా అథ్లెట్(19) లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఈ ఏడాది మే నెలలో ఫిర్యాదు చేసింది. మసాజ్ పేరుతో కోచ్‌ తనను తాకరాని చోట తాకి పైశాచికత్వాన్ని ప్రదర్శించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. భయం కారణంగా కోచ్‌కు ఎదురు చెప్పలేకపోయానని, చాలా సందర్భాల్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాని పేర్కొంది. ఈ కేసులో నాగరాజన్‌ను విచారించిన పోలీసులు అతనిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి, ఛార్జిషీట్‌ ఓపెన్‌ చేశారు. 

కాగా, ఈ ఉదంతం వెలుగు చూసాక మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఫిర్యాదు చేసిన వారిలో కొందరు గతంలో నాగరాజన్‌ వద్ద శిక్షణ తీసుకున్న వారు కాగా, మరికొందరు ప్రస్తుతం జూనియర్లుగా శిక్షణ పొందుతున్నవారున్నారు. వీరందరూ కామ కోచ్‌ ఆకృత్యాలను ఒక్కొకటిగా బయటపెట్టడంతో పోలీసులు నివ్వెరపోతున్నారు. ఎంతో మంది అథ్లెట్లను జాతీయ స్థాయిలో ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన నాగరాజన్‌.. ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడని తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. నాగరాజన్‌ వెదవ వేశాలపై మరికొందరు ట్విటర్‌ ద్వారా తమను సంప్రదించారని పోలీసులు పేర్కొన్నారు. 
చదవండి: ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం

మరిన్ని వార్తలు