సెమీఫైనల్లో నిఖత్‌ జరీన్‌

26 Oct, 2021 05:42 IST|Sakshi

జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. హిస్సార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నిఖత్‌ 52 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో నిఖత్‌ 5–0తో మంజు బసుమతిరి (అస్సాం)పై నెగ్గింది. 48 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత మంజు రాణి 5–0తో మీనాక్షి (పంజాబ్‌)పై గెలిచింది.

మరిన్ని వార్తలు