Womens WC 2022: రెప్పపాటులో స్టన్నింగ్‌ క్యాచ్‌..  చూపులతోనే ఫిదా

5 Mar, 2022 18:50 IST|Sakshi

ఐసీసీ వుమెన్స్‌ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియన్‌ ప్లేయర్‌  జొనాస్సెన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసింది. బుల్లెట్‌ కంటే వేగంగా వచ్చిన బంతిని ఒంటి చేత్తో అందుకొని ఔరా అనిపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ సందర్భంగా ఆఖరి ఓవర్‌ను జోనాస్సెన్‌ వేసింది. ఓవర్‌ రెండో బంతిని ఇంగ్లండ్‌ బ్యాటర్‌ కాథరిన్‌ బ్రంట్‌ స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడే ప్రయత్నం చేసింది. అందుకు తగ్గట్టగానే బ్యాట్‌తో పర్‌ఫెక్ట్‌ షాట్‌ ఆడింది. కానీ బౌలర్‌ జొనాస్సెన్‌ బంతికి అడ్డుగోడలా నిలిచింది.

తన చేతికి చిక్కితే బంతి ఎక్కడికి వెళ్లదు అన్నట్లుగా.. రెప్పపాటులో వేగంగా వెళుతున్న బంతి ఎడమ చేత్తో స్టన్నింగ్‌గా అందుకుంది. అంతే పట్టిన ఆమెకు.. చూస్తున్న మనకు.. క్రీజులో ఉన్న బ్యాటర్‌కు.. ఫీల్డర్లు అందరికి షాక్‌ తగిలింది. అసలు క్యాచ్‌ పట్టానా అన్న రీతిలో జొనాస్సెస్‌ ఇచ్చిన లుక్స్‌.. చిరునవ్వు హైలెట్‌గా నిలిచాయి. జొనాస్సెన్‌ క్యాచ్‌ పట్టిన దానికంటే ఆమె ఇచ్చిన లుక్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోనూ షేర్‌ చేసింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రేచల్‌ హేన్స్ (131 బంతుల్లో 130; 14 ఫోర్లు, సిక్స్‌) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్‌ చేయగా, ఛేదనలో నథాలీ స్కీవర్‌ (85 బంతుల్లో 109 నాటౌట్‌; 13 ఫోర్లు) అజేయమైన శతకంతో మెరిసినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయింది. ఆసీస్‌ బౌలర్లు అలానా కింగ్‌ 3 వికెట్లు, తహిల మెక్‌గ్రాత్‌, జెస్‌ జొనాస్సెన్‌ తలో 2 వికెట్లు, మెగాన్‌ ష్కట్‌ ఓ వికెట్‌ పడగొట్టడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

చదవండి: Womens World Cup 2022: ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టిన ఆసీస్‌... బంగ్లాను ఆటాడుకున్న సౌతాఫ్రికా

Icc women's world cup 2022: న్యూజిలాండ్‌పై వెస్టిండీస్‌ సంచలన విజయం

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు