Women WC 2022- Mithali Raj: 5 పరుగులకే అవుట్‌ అయినా.. ప్రపంచకప్‌ టోర్నీలో మిథాలీ అరుదైన రికార్డు

12 Mar, 2022 08:49 IST|Sakshi

ICC Women ODI World Cup 2022- Mithali Raj: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో భారత మహిళా జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా నిలిచింది. తద్వారా ఆస్ట్రేలియా సారథి బెలిండా క్లార్క్‌(23 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. 

కాగా ఐసీసీ మెగా టోర్నీలో 39 ఏళ్ల మిథాలీకి కెప్టెన్‌గా ఇది 24వ మ్యాచ్‌. అదే విధంగా.. విండీస్‌తో మ్యాచ్‌ ద్వారా మరో ఘనతను కూడా మిథాలీ తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచకప్‌ ఆరు ఎడిషన్లలో పాల్గొన్న మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇక విండీస్‌తో మ్యాచ్‌లో బ్యాటర్‌గా మాత్రం మిథాలీ ఆకట్టుకోలేకపోయింది. 11 బంతులు ఎదుర్కొన్న ఆమె 5 పరుగులకే అవుట్‌ అయి అభిమానులకు మరోసారి నిరాశే మిగిల్చింది.

మహిళా వన్డే కప్‌ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్లు:
మిథాలీ రాజ్‌- భారత్‌- 24
బెలిండా క్లార్క్‌- ఆస్ట్రేలియా- 23
సుసాన్‌ గోట్‌మాన్‌(న్యూజిలాండ్‌)- 19
త్రిష్‌ మెకెల్వీ(న్యూజిలాండ్‌)- 15
మేరీ పాట్‌ మూరే(ఐర్లాండ్‌)- 15

చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ఆసీస్‌ కెప్టెన్‌.. ఐపీఎల్లోకి రీఎంట్రీ 

మరిన్ని వార్తలు