తొలి రోజు నుంచే మహిళల క్రికెట్‌

17 Oct, 2020 05:45 IST|Sakshi

2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల టి20 క్రికెట్‌ తొలి రోజే ప్రేక్షకులను అలరించనుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ పోటీల నిర్వాహక కమిటీ తాజాగా ప్రకటించిన షెడ్యూల్‌లో పోటీల తొలి రోజైన 2022 జూలై 29న మహిళల క్రికెట్‌ మొదలవుతుంది. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 11 రోజులపాటు ఆగస్టు 8 వరకు జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో మొత్తం 19 అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. పోటీలు గతంలో ప్రకటించినట్లుగా జూలై 28న కాకుండా ఒకరోజు ఆలస్యంగా జూలై 29న ప్రారంభం కానున్నాయి. కామన్వెల్త్‌ క్రీడల్లో ఒకే ఒకసారి క్రికెట్‌ భాగంగా ఉంది. 1998లో మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో వన్డే ఫార్మాట్‌లో జట్లు పోటీ పడ్డాయి. దక్షిణాఫ్రికా స్వర్ణం గెలుచుకోగా...ఈ పోటీలకు ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్‌లుగా కాకుండా... దేశవాళీ వన్డే హోదా మాత్రమే ఇచ్చింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు