Womens Asia Cup 2022: ఆసియాకప్‌లో భారత్‌ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం

4 Oct, 2022 16:46 IST|Sakshi

మహిళల ఆసియాకప్‌-2022లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. షెల్లాట్‌ వేదికగా యూఏఈ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ ఆసియాకప్‌లో వరుసగా మూడో విజయాన్ని భారత్‌ తమ ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ(49 బంతుల్లో 64), రోడ్రిగ్స్( 45 బంతుల్లో 75) అర్ధ సెంచరీలతో చెలరేగారు. యూఏఈ బౌలర్లలో గౌర్‌, మొఘల్‌, కోట్టి, ఇషా రోహిత్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక 179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులకే పరిమితమైంది.

యూఏఈ బ్యాటర్లో కవిషా ఎగోడాగే(30 నటౌట్‌), కుషీ శర్మ(29) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. కాగా భారత బౌలర్లలో రాజేశ్వరి గయక్వాడ్ రెండు వికెట్లు, దయాలన్‌ హేమలత ఒక్క వికెట్‌ సాధించింది. ఇక భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆక్టోబర్‌7న తలపడనుంది.
చదవండి: LLC 2022: మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ

మరిన్ని వార్తలు