FIH Women's Hockey World Cup 2022: మహిళల ప్రపంచకప్‌ హాకీకి సర్వం సిద్దం

1 Jul, 2022 07:56 IST|Sakshi

టెరసా (స్పెయిన్‌): మహిళల ప్రపంచకప్‌ హాకీకి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 17 రోజుల పాటు అమ్మాయిలు స్టిక్స్‌తో అలరించనున్నారు. స్పెయిన్, నెదర్లాండ్స్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. నేడు జరిగే మెగా ఈవెంట్‌ ఆరంభ మ్యాచ్‌లో స్పెయిన్‌తో కెనడా తలపడుతుంది.

భారత అమ్మాయిల జట్టు ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. డిఫెండింగ్‌ చాంపియన్, టోర్నీ హాట్‌ ఫేవరెట్‌ నెదర్లాండ్స్‌ మరోసారి హ్యాట్రిక్‌ టైటిళ్లపై కన్నేసింది. 2014, 2018లో విజేతగా నిలిచిన డచ్‌ అమ్మాయిలు 1983, 1986, 1990లలో హ్యాట్రిక్‌ టైటిల్స్‌ గెలిచారు. ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యమవని రీతిలో 8 టైటిల్స్‌ను నెదర్లాండ్స్‌ కైవసం చేసుకుంది. భారత మహిళలు గత టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు.

ఇప్పుడు అదే ఉత్సాహంతో ప్రపంచకప్‌లోనూ రాణించాలనే పట్టుదలతో ఉన్నారు. 48 ఏళ్ల అమ్మాయిల ప్రపంచకప్‌ హాకీ చరిత్రలో భారత్‌ మెరుగైన ప్రదర్శన ‘నాలుగో స్థానం’. మెగా ఈవెంట్‌ ఆరంభమైన 1974లో కాంస్య పతక పోరులో వెస్ట్‌ జర్మనీ చేతిలో ఓడింది. ఆ తర్వాత మళ్లీ పతక పోటీలో ఏనాడు నిలువలేకపోయింది. 
4 పూల్స్‌... 16 జట్లు... 
పూల్‌–ఎ: నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, చిలీ. 
పూల్‌–బి: భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, చైనా. 
పూల్‌–సి: స్పెయిన్, అర్జెంటీనా, దక్షిణ కొరియా, కెనడా. 
పూల్‌–డి: ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, దక్షిణాఫ్రికా.
చదవండి: SL-W vs IND-W: శ్రీలంకతో భారత్‌ తొలి పోరు..

మరిన్ని వార్తలు