Womens World Cup 2022: టాయిలెట్‌లో చిక్కుకుపోయిన మహిళా క్రికెటర్‌.. మ్యాచ్‌ కోసం

1 Mar, 2022 17:46 IST|Sakshi

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ నొకోలా కేరికి వింత అనుభవం ఎదురైంది. ఆమె దాదాపు 20 నిమిషాల పాటు టాయిలెట్‌లో చిక్కుకుపోయారు. మ్యాచ్‌ మొదలయ్యే సమయానికి కేరీ అందుబాటులోకి రాకపోవడంతో జట్టును ఆందోళన కలిగించింది. ఆ తర్వాత జట్టుతో చేరిన కేరీ అసలు విషయం చెప్పడంతో నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. మహిళల వన్డే ప్రపంచకప్‌ మార్చి 4 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27న ఆస్ట్రేలియా మహిళల జట్టు న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టింది. సోమవారం వెస్టిండీస్‌తో వార్మప్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి కేరీ అందుబాటులోకి రాలేదు. ఏమైందా అని జట్టు కాస్త కంగారు పడింది. అరగంట తర్వాత కేరీ మైదానంలో దర్శనం ఇచ్చింది.

విషయమేంటని కేరీని ఆరా తీయగా.. ''టాయిలెట్‌కు వెళ్లాను. పని పూర్తి చేసుకొని బయటకు వద్దామంటే డోర్‌ లాక్‌ అవ్వడంతో బయటికి రాలేకపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 20 నిమిషాల పాటు టాయిలెట్‌లోనే ఉండిపోయాడు. ఆ తర్వాత సమాచారం అందుకున్న మా మేనేజర్‌ మాస్టర్‌ కీ సాయంతో డోర్‌ లాక్‌ తీశాడు. ఒకవేళ అది లేకుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో. మ్యాచ్‌ ఆడేందుకు డోర్‌ను బద్దలు కొట్టైనా బయటకు వచ్చేసేదాన్ని'' అంటూ పేర్కొంది. 

ఇక రికార్డు స్థాయిలో ఏడో ప్రపంచకప్‌ టైటిల్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు వార్మప్‌ మ్యాచ్‌లో జోరు కనబరిచింది. టాస్‌ గెలిచిన విండీస్‌ ఫీల్డింగ్‌ ఏంచుకోగా.. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 259 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ వుమెన్స్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి 90 పరుగులుతో ఓటమి పాలైంది.

చదవండి: Kohli-BCCI: 'కోహ్లిపై కోపం తగ్గలేదా'.. బీసీసీఐని ఏకిపారేసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌

Russia-Ukraine War: ర‌ష్యా అధ్యక్షుడికి వరుస షాక్‌లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొల‌గింపు

Russia-Ukraine Crisis: దేశం కోసం కీలక మ్యాచ్‌ను వదిలేసుకున్న టెన్నిస్‌ స్టార్‌

మరిన్ని వార్తలు