IPL 2022: 'ఆర్సీబీ కెప్టెన్‌గా మ‌ళ్లీ కోహ్లి కావాలి.. అయితే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్'

9 Feb, 2022 14:36 IST|Sakshi

ఐపీఎల్‌-2022లో ఈ సారి  మొత్తం 10 జ‌ట్లు పాల్గోన‌బోతున్నాయి. కాగా ఈ 10 జట్లులో ఇప్ప‌టికే 7 జ‌ట్లు కెప్టెన్‌ల‌ను నియ‌మించాయి. ఇక మిగితా మూడు జ‌ట్లు పంజాబ్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్ జ‌ట్లు సార‌థిల‌ను ఎంపిక చేసిన ప‌నిలో పడ్డాయి. ఇక ఆర్సీబీ విష‌యానికి వ‌స్తే.. ఐపీఎల్‌-2021 సీజ‌న్ అనంత‌రం సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి విరాట్ కోహ్లి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్సీబీ జ‌ట్టుకు ఎవ‌రు నాయ‌కత్వం వ‌హిస్తార‌న్న‌ది అంద‌రి మెద‌డ‌ల‌ను తొలుస్తున్న ప్రశ్న‌. ఈ క్ర‌మంలో భార‌త మాజీ స్పిన్న‌ర్ హర్భజన్ సింగ్ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశాడు. విరాట్ కోహ్లి మ‌ళ్లీ ఆర్సీబీ జ‌ట్టుకు నాయకత్వం వహించడానికి అంగీకరిస్తే ఎవ‌రూ ఆశ్చర్యపోనవసరం లేదు అని అత‌డు తెలిపాడు.

"రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జ‌ట్టును తయారు చేస్తోంది. అదే విధంగా మంచి కెప్టెన్‌కోసం కూడా వారు వెతుకుతున్నారు. అయితే కోహ్లి మ‌ళ్లీ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌ప‌డ‌తాడ‌ని నేను భావిస్తున్నాను. అత‌డు మ‌రో రెండు సంవ‌త్స‌రాలు  కెప్టెన్‌గా ఉండటానికి అంగీకరించినా నేను ఆశ్చర్యపోను.  భవిష్యత్తులో జ‌ట్టును నడిపించగల యువ ఆటగాడిని ఎంపిక చేసుకోవాలి. భారత ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఇద్దరు జట్టును సమర్ధవంతంగా నడిపించగలరు. వారు వేలంలో ఇషాన్ కిష‌న్ లేదా శ్రేయస్ అయ్య‌ర్‌ల‌ను తీసుకుంటే, వారు భ‌విష్య‌త్ కెప్టెన్‌లు అవుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టులో స్టార్ ఆట‌గాళ్లు ఉన్నప్ప‌టికీ టైటిల్‌ను ఒక్క సారి ఆర్సీబీ గెల‌వ‌లేక పోయింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్ధితుల్లో కోహ్లి మ‌ళ్లీ కెప్టెన్సీ బాధ్య‌త‌లు తీసుకోవాల్సి ఉంటుంది" అని హర్భజన్ సింగ్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.

చ‌ద‌వండి: NZ-W vs IND-W: తొలి వ‌న్డే ముందు భార‌త్‌కు బిగ్ షాక్‌.. స్టార్ బ్యాట‌ర్ దూరం!

మరిన్ని వార్తలు