World Cup 2023: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా..

12 Nov, 2023 13:36 IST|Sakshi

Live updates: మొదటి వికెట్‌ కోల్పోయిన భారత్‌

100 పరుగుల వద్ద భారత జట్టు మొదటి వికెట్‌ కోల్పోయింది. 11.5 ఓవర్ల వద్ద ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఔటయ్యాడు. అప్పటికే హాఫ్‌ సెంచరీ (51) పూర్తి చేసిన గిల్‌.. మీకెరెన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు.

బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా 11 ఓవర్లకు ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ అర్ధ శతకాలకు చేరువయ్యారు.

  • స్థిరంగా బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా 11 ఓవర్లకు ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ అర్ధ శతకాలకు చేరువయ్యారు.

వన్డే ప్రపంచకప్‌-2023లో చివరి లీగ్‌ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తమ జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.

తుది జట్లు
భారత్‌:  రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

నెదర్లాండ్స్‌: వెస్లీ బరేసి, మాక్స్ ఓ డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

మరిన్ని వార్తలు