అసలు పోరుకు ముందు..

29 Sep, 2023 04:30 IST|Sakshi

ప్రపంచకప్‌ మరో 6 రోజుల్లో

అక్టోబర్‌ 5 నుంచి మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌ కోసం నేటి నుంచి అన్ని జట్లు వామప్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తం 10 జట్లు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో పాకిస్తాన్‌–న్యూజిలాండ్‌... గువాహటిలో శ్రీలంక–బంగ్లాదేశ్‌... తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా–అఫ్గానిస్తాన్‌ జట్లు వామప్‌ మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతాయి. పూర్తిస్థాయిలో పోలీసుల బందోబస్తు లేని కారణంగా పాకిస్తాన్, న్యూజి లాండ్‌ మ్యాచ్‌ను ప్రేక్షకుల్లేకుండా నిర్వహిస్తారు. ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–1 చానెల్‌లో, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. పాకిస్తాన్‌ జట్టు క్రికెటర్లు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్, ఫఖర్‌ జమాన్, షాహిన్‌ అఫ్రిది, హసన్‌ అలీ తదితరులు గురువారం ఉప్పల్‌ స్టేడియంలో రెండున్నర గంటలపాటు ప్రాక్టీస్‌ చేశారు.

మరిన్ని వార్తలు