Xavier Doherty: వడ్రంగిగా మారిన ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌!

31 May, 2021 11:01 IST|Sakshi

ఆస్ట్రేలియా(కాన్బెర్రా): భారత దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌ కారణంగా కొత్తగా ఎంతో మంది స్వదేశీ, విదేశీ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. వారికి వేలంలో ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ప్రతిభ నిరూపించుకంటే కోట్లకు కోట్లు ఆర్జించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాళ్లు కూడా కొంతమంది ఈ లీగ్‌లో ఆడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. కొంతమంది పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది.  ఆస్ట్రేలియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్‌ పొట్ట పోషించుకోవడానికి వడ్రంగిగా మారిపోయాడు. జేవియర్ డోహెర్టీ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించి నాలుగేళ్లకు పైగా అవుతోంది. 2015 ప్రపంచ కప్‌ విజేత అయిన ఆస్ట్రేలియా జట్టులో అతడు భాగస్వామిగా ఉన్నాడు.

లెప్ట్‌ ఆర్మ్ స్పిన్నర్ అయిన జేవియర్ డోహెర్టీ 2001-02 సీజన్లో తన ఫస్ట్-క్లాస్ జట్టులో అరంగేట్రం చేశాడు. దాదాపు అతను 17 సంవత్సరాల పాటు క్రికెట్‌లో కొనసాగారు. 71 ఫస్ట్ క్లాస్, 176 లిస్ట్ ఏ, 74 టీ-20 మ్యాచ్‌లు ఆడిన అతడు మొత్తం 415 వికెట్లు పడగొట్టాడు. ఇక అతడు చివరిసారిగా 2015లో ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కనిపించాడు. ఈ మాజీ ఆస్ట్రేలియన్‌ లెప్ట్‌ ఆర్మ్ స్పిన్నర్ ఇప్పటిరకు ఆస్ట్రేలియా తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు ఆడాడు. కాగా 2020, మార్చిలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ కోసం చివరిసారిగా ఆడాడు.


(చదవండి: Mithali Raj: వ్యక్తిగతం కాదు... సమష్టితత్వం ముఖ్యం)

మరిన్ని వార్తలు