ఆశిద్దాం ఆటకు 'అచ్చేదిన్'...

1 Jan, 2021 04:02 IST|Sakshi

2021లో కనువిందు చేయనున్న క్రీడా ప్రపంచం 

ఆనందంగా, ఉత్సాహంగా మైదానంలో చప్పట్లు కొడుతూ అభిమాన ఆటగాళ్లను అభినందించే రోజు రావాలని... వాయిదాలు, రద్దుల పర్వం ఇకనైనా వినిపించరాదని... బయో బబుల్‌ అంటూ గుబులు పెట్టించే బాధ అథ్లెట్లకు తప్పాలని... 2021లో అనుకున్న తేదీల్లోనే జరిగి ఆటలకు ‘అచ్ఛే దిన్‌’ వస్తాయని కోరుకుందాం... కరోనా దెబ్బకు కుప్పకూలిన క్రీడలు మునుపటిలా మనకు సంతోషం పంచాలని ఆశిద్దాం. టోక్యో ఒలింపిక్స్, టి20 ప్రపంచకప్‌... ఇలా శిఖరాన నిలిచే టోర్నీలతో పాటు ఈ ఏడాది జరగబోయే పలు ప్రధాన టోర్నీలను చూస్తే...  

క్రికెట్‌... భారత్‌ బిజీ బిజీ...  
కరోనా కారణంగా 2020లో తక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత జట్టుకు 2021లో ఎడతెరిపిలేని షెడ్యూల్‌ ఉంది. ప్రస్తుతం ఆ్రస్టేలియాలో ఉన్న భారత్‌ సిడ్నీలో జనవరి 7 నుంచి మూడో టెస్టు... జనవరి 15 నుంచి చివరిదైన నాలుగో టెస్టు ఆడుతుంది. ఆ్రస్టేలియా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చాక తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఆడుతుంది. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు జరిగే ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య 4 టెస్టులు, 5 టి20 మ్యాచ్‌లు, 3 వన్డేలు జరుగుతాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన వెంటనే ఏప్రిల్‌–మే నెలల్లో ఐపీఎల్‌ జరుగుతుంది. ఇది ముగిశాక... ఒకవేళ భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తే జూన్‌లో ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ మైదానంలో ఫైనల్‌ ఆడేందుకు వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం ఆగస్టులో ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టెస్టులు జరుగుతాయి. సెప్టెంబర్‌ చివరి వారంలో ఆసియా కప్‌ టోర్నమెంట్‌... అక్టోబర్‌–నవంబర్‌లలో స్వదేశంలో టి20 వరల్డ్‌కప్‌లో భారత్‌ బరిలోకి దిగనుంది. నవంబర్‌లో టి20 ప్రపంచకప్‌ ముగిశాక భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళుతుంది. అక్కడ సఫారీ జట్టుతో మూడు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది.  

ఫార్ములావన్‌  

కరోనా కారణంగా గతేడాది 17 రేసులకే పరిమితమైన ఫార్ములావన్‌ కొత్త సంవత్సరంలో 23 రేసులతో దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. మార్చి 21న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలయ్యే సీజన్‌... డిసెంబర్‌ 5న అబుదాబి గ్రాండ్‌ప్రితో ముగియనుంది. ఈ మధ్యలో మార్చి 28న బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రి, ఏప్రిల్‌ 11న చైనా, మే 9న స్పెయిన్, 23న మొనాకో, జూన్‌ 6న అజర్‌బైజాన్, 13న కెనడా, 27న ఫ్రాన్స్, జూలై 4న ఆ్రస్టియా, 18న యూకే, ఆగస్టు 1న హంగరీ, 29న బెల్జియం, సెపె్టంబర్‌ 5న నెదర్లాండ్స్, సెపె్టంబర్‌ 12న ఇటలీ, 26న రష్యా, అక్టోబర్‌ 3న సింగపూర్, 10న జపాన్, 24న యూఎస్‌ఏ, 31న మెక్సికో, నవంబర్‌ 14న బ్రెజిల్, 28న సౌదీ అరేబియా గ్రాండ్‌ ప్రి రేసులు జరుగుతాయి. రేసు క్యాలెండర్‌లో సౌదీ అరేబియా ఈ ఏడాదే అరంగేట్రం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 25న జరిగాల్సిన గ్రాండ్‌ ప్రి వేదిక ఇంకా ఖరారు కాలేదు.  

బ్యాడ్మింటన్‌  

ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకావకాశాలు మెండుగా ఉన్న క్రీడ బ్యాడ్మింటన్‌. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ముందు ప్లేయర్లు మునుపటి లయను అందుకోవడానికి కొత్త ఏడాదిలో చాలినన్ని వరల్డ్‌ టూర్‌ సూపర్‌ టోరీ్నలు సిద్ధంగా ఉన్నాయి. జనవరి 12–17: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ, 19–24: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ, 27–31: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ, మార్చి 17–21: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ సూపర్‌–1000, ఏప్రిల్‌ 6–11: మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500, 13–18: సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500, మే 11–16: ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500, జూన్‌ 1–6: ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500, 8–13: ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000; ఆగస్టు 24–29: హైదరాబాద్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100, ఆగస్టు 31– సెపె్టంబర్‌ 5: కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500, సెపె్టంబర్‌ 21–26: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000, సెపె్టంబర్‌ 28–అక్టోబర్‌ 3: జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750, అక్టోబర్‌ 12–17: సయ్యద్‌ మోదీ ఇండియా ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300, 19–24: డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750, 26–31: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750, నవంబర్‌ 9–14: ఫుజు చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750, 16–21: హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500, డిసెంబర్‌ 15–19: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ జరుగుతాయి.  

టెన్నిస్‌  

ఫిబ్రవరి 8–21: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ, మార్చి 24–ఏప్రిల్‌ 4: మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ, ఏప్రిల్‌ 11–18: మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ, మే 2–9: మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ, మే 23–జూన్‌ 6: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ, జూన్‌ 28–జూలై 7: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ, ఆగస్టు 9–22: రోజర్స్‌ కప్, 15–22: సిన్సినాటి ఓపెన్, ఆగస్టు 30–సెప్టెంబర్‌ 12: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్, అక్టోబర్‌ 10–17: షాంఘై మాస్టర్స్‌ సూపర్‌–1000 టోర్నీ, నవంబర్‌ 1–7: పారిస్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ, 14–21: సీజన్‌ ముగింపు ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ. 

షూటింగ్‌  
ఫిబ్రవరి 22–మార్చి 5: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ (ఈజిప్ట్‌), మార్చి 18–29: వరల్డ్‌ కప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ (న్యూఢిల్లీ), ఏప్రిల్‌ 16–27: వరల్డ్‌కప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ (దక్షిణ కొరియా), మే 7–17: వరల్డ్‌ కప్‌ షాట్‌గన్‌ (ఇటలీ).

చెస్‌  
జనవరి 15–31: టాటా స్టీల్‌ (నెదర్లాండ్స్‌), 17–29: మహిళల గ్రాండ్‌ ప్రి, ఏప్రిల్‌ 8–14: క్యాండిడేట్స్‌ టోర్నీ (రష్యా), మే 23–31: చాంపియన్స్‌ చెస్‌ టూర్, జూన్‌ 4–15: చెస్‌ క్లాసిక్‌ టోర్నీ (రొమేనియా), 17–22: పారిస్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ టోర్నీ, జూలై 5–12: క్రొయేíÙయా ర్యాపిడ్, బ్లిట్జ్‌ టోర్నీ, 17–28; బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌ (స్విట్జర్లాండ్‌), ఆగస్టు 10–15: సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ టోర్నీ, అక్టోబర్‌ 25–నవంబర్‌ 8: ఫిడే గ్రాండ్‌ స్విస్‌ అండ్‌ మహిళల గ్రాండ్‌ స్విస్‌ టోర్నీ, నవంబర్‌–డిసెంబర్‌: ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ (దుబాయ్‌).  

మరిన్ని వార్తలు