IND vs SA: 24 ఏళ్ల క్రితం సొంతగడ్డపై.. 18 ఏళ్ల క్రితం విదేశీ గడ్డపై

28 Dec, 2021 16:30 IST|Sakshi

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌ వైఫల్యం మరోసారి కనిపించింది. రెండోరోజు ఆట వర్షంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. 272/3 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించింది. కేఎల్‌ రాహుల్‌ 122 పరుగులు, రహానే 40 పరుగులతో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 278 పరుగులకు చేరగానే కేఎల్‌ రాహుల్‌(123 పరుగులు) రూపంలో వికెట్‌ కోల్పోయింది. అంతే అక్కడి నుంచి టీమిండియా ఇన్నింగ్స్‌ పేకమేడను తలపించింది. కేవలం 49 పరుగుల వ్యవధిలో మిగతా ఏడు వికెట్లు చేజార్చుకోవడం విశేషం.

చదవండి: IND Vs SA: బుమ్రా స్టన్నింగ్‌ డెలివరీ.. అనవసరంగా గెలుక్కున్నాడు

ఈ నేపథ్యంలో టీమిండియా ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత అదే సీన్‌ను రిపీట్‌ చేసింది. 2003-04 ఆసీస్‌ పర్యటనలో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 311/3తో పటిష్టంగా కనిపించింది. అయితే మిగతా ఏడు వికెట్లను 55 పరుగుల వ్యవధిలో చేజార్చుకొని 366 పరుగులకు ఆలౌటైంది. ఇక అంతకముందు మరో ఆరేళ్లు వెనక్కి వెళితే.. అంటే 1997-98లో వెస్టిండీస్‌ టీమిండియా పర్యటనకు వచ్చింది. ముంబై వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 471 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. అయితే ఎవరు ఊహించని విధంగా 41 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు చేజార్చుకొని 512 పరుగులకు ఆలౌటైంది.

చదవండి: IND VS SA 1st Test: లడ్డూలాంటి క్యాచ్‌ వదిలేశారు.. ఫలితం అనుభవించండి

మరిన్ని వార్తలు