ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ బరిలో వొజ్నియాకి

7 Dec, 2023 00:24 IST|Sakshi

ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్‌ టెన్నిస్‌ స్టార్‌ వొజ్నియాకికి వచ్చే ఏడాది జరిగే తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం 242వ ర్యాంక్‌లో ఉన్న 33 ఏళ్ల వొజ్నియాకికికి నిర్వాహకులు ‘వైల్డ్‌ కార్డు’ కేటాయించారు. 2018లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన వొజ్నియాకికి 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. గత ఏడాది ఆగస్టులో పునరాగమనం చేసి యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడింది. 

>
మరిన్ని వార్తలు