WPL 2023 Full Schedule: పూర్తి షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. వివరాలివే

3 Mar, 2023 16:30 IST|Sakshi

WPL 2023 Full Schedule- Where To Watch: మహిళా క్రికెట్‌ అభివృద్ధిలో భాగంగా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు శనివారం(మార్చి 4) తొలి అడుగుపడనుంది. ముంబై ఇండియన్స్‌- గుజరాత్‌ జెయింట్స్‌ జట్ల మధ్య పోటీతో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. డబ్ల్యూపీఎల్‌ తొలి టైటిల్‌ కోసం ఐదు జట్లు పోటీపడనున్నాయి.

ముంబైలో జరుగనున్న ఈ టీ20 లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. 

కాగా లీగ్‌ దశలో డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో ఐదు జట్లు పోటీపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో ప్రథమస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌తో మరో ఫైనలిస్టు ఖరారవుతుంది.

ఈ నేపథ్యంలో డివై పాటిల్‌ స్టేడియం, బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా జరుగననున్న 22 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ తదితర వివరాలు..  

పూర్తి షెడ్యూల్‌.. ఎవరితో ఎవరు? మ్యాచ్‌ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)..
1. మార్చి 4- శనివారం- గుజరాత్‌ జెయింట్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ వుమెన్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 
2. మార్చి 5- ఆదివారం- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌- బ్రబౌర్న్‌ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు..
3. మార్చి 5- ఆదివారం- యూపీ వారియర్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ జెయింట్స్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 
4. మార్చి 6- సోమవారం-  ముంబై ఇండియన్స్‌ వుమెన్‌  వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌ - బ్రబౌర్న్‌ స్టేడియం-  రాత్రి 7.30 గంటలకు 
5. మార్చి 7- మంగళవారం- ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌ వర్సెస్ యూపీ వారియర్స్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు

6. మార్చి 8- బుధవారం- గుజరాత్‌ జెయింట్స్‌ వర్సెస్‌  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌- బ్రబౌర్న్‌ స్టేడియం-  రాత్రి 7.30 గంటలకు
7. మార్చి 9- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌ వర్సెస్ ముంబై ఇండియన్స్‌ వుమెన్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
8. మార్చి 10- శుక్రవారం- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌ వర్సెస్‌ యూపీ వారియర్స్- బ్రబౌర్న్‌ స్టేడియం-  రాత్రి 7.30 గంటలకు
9. మార్చి 11- శనివారం- గుజరాత్‌ జెయింట్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
10. మార్చి 12- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్‌ వుమెన్‌ -  బ్రబౌర్న్‌ స్టేడియం-  రాత్రి 7.30 గంటలకు

11. మార్చి 13- సోమవారం- ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్ వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్‌ - డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
12. మార్చి 14- మంగళవారం- ముంబై ఇండియన్స్‌ వుమెన్‌ వర్సెస్‌ గుజరాత్‌ జెయింట్స్-  బ్రబౌర్న్‌ స్టేడియం-  రాత్రి 7.30 గంటలకు
13.‌ మార్చి 15- బుధవారం- యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్-  డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
14. మార్చి 16- గురువారం-  ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్ వర్సెస్ గుజరాత్‌ జెయింట్స్‌-  బ్రబౌర్న్‌ స్టేడియం-  రాత్రి 7.30 గంటలకు
15. మార్చి 18- శనివారం- ముంబై ఇండియన్స్‌ వుమెన్‌ వర్సెస్‌  యూపీ వారియర్స్‌-  డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు

16. మార్చి 18- శనివారం-  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్ వర్సెస్‌ గుజరాత్‌ జెయింట్స్‌-  బ్రబౌర్న్‌ స్టేడియం-  రాత్రి 7.30 గంటలకు
17. మార్చి 20- సోమవారం- గుజరాత్‌ జెయింట్స్‌ వర్సెస్‌ యూపీ వారియర్స్‌-  బ్రబౌర్న్‌ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు
18. మార్చి 20- సోమవారం- ముంబై ఇండియన్స్‌ వుమెన్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
19. మార్చి 21- మంగళవారం- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ వుమెన్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు
20. మార్చి 21- మంగళవారం- యూపీ వారియర్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌- బ్రబౌర్న్‌ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు

21. మార్చి 24- శుక్రవారం- ఎలిమినేటర్‌ మ్యాచ్‌- డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు
22. మార్చి 26- ఆదివారం- ఫైనల్‌ మ్యాచ్‌- బ్రబౌర్న్‌ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు

లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..
టీవీ: స్పోర్ట్స్‌18 నెట్‌వర్క్‌
డిజిటల్‌ మీడియా: జియో సినిమా యాప్‌, వెబ్‌సైట్‌

చదవండి: IND vs AUS: టెస్టు మ్యాచ్‌ కేవలం మూడు రోజులా? దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ
IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్‌ చర్యకు మైండ్‌బ్లాక్‌

మరిన్ని వార్తలు