WPL 2023: అంబానీ వర్సెస్‌ అదానీ.. తొలి మ్యాచ్‌లో ముంబైతో అహ్మదాబాద్‌ ‘ఢీ’

4 Feb, 2023 10:52 IST|Sakshi
ట్రోఫీతో దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (PC: BCCI)

Women Premier League 2023: మహిళల క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాందిగా ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) త్వరలోనే ఆరంభం కానుంది. లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ముంబైలోనే జరుగనున్నాయి. నగరంలోని బ్రబోర్న్, డీవై పాటిల్‌ స్టేడియాలను టోర్నీ వేదికలుగా ఎంపిక చేశారు. షెడ్యూల్‌పై బోర్డు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా... మార్చి 4న తొలి మ్యాచ్‌ జరుగుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

మొత్తం 22 మ్యాచ్‌లు
భారత కార్పొరేట్‌ దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలకు చెందిన ముంబై, అహ్మదాబాద్‌ టీమ్‌లు ఈ పోరులో తలపడే అవకాశం ఉంది. ముంబైలోని ప్రధాన స్టేడియం వాంఖడేను ఐపీఎల్‌ కోసం మాత్రమే వినియోగిస్తారు. మొత్తం 22 మ్యాచ్‌లు ఉండే ఈ టోర్నీ ఫైనల్‌ మార్చి 26న జరుగుతుంది.

ప్లే ఆఫ్స్‌నకు మూడు టీమ్‌లు
ఐదు జట్లు పాల్గొంటున్న డబ్ల్యూపీఎల్‌లో మూడు టీమ్‌లు ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తాయి. లీగ్‌ దశలో ఒక్కో టీమ్‌ ఇతర నాలుగు జట్లతో (మొత్తం 8 మ్యాచ్‌లు) తలపడుతుంది. అత్యధిక పాయింట్ల జట్టు ఫైనల్‌కు చేరితే... మరో ఫైనలిస్ట్‌ కోసం తర్వాతి రెండు టీమ్‌ల మధ్య ఎలిమినేటర్‌ నిర్వహిస్తారు. ఫ్రాంచైజీ ఒప్పందాలు ఖరారు చేసేందుకు శుక్రవారం ఐదు టీమ్‌ల యాజమాన్యాలతో బీసీసీఐ సమావేశమైంది. 

మహిళల ఐపీఎల్‌ జట్లను కొనుగోలు చేసిన సంస్థలు ఇవే
1. అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అహ్మదాబాద్‌, 1289 కోట్లు)
2. ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ముంబై, 912.99 కోట్లు)
3. రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు, 901 కోట్లు)
4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఢిల్లీ, 810 కోట్లు)
5. క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (లక్నో, 757 కోట్లు)

చదవండి: BGT 2023: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా! ఫోటోలు వైరల్‌
Shaheen Afridi: షాహీన్‌ అఫ్రిది 'నిఖా' హోగయా.. ప్రత్యేక అతిధి ఎవరంటే..?

మరిన్ని వార్తలు