WPL 2023 MI vs RCB: మథ్యూస్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై

6 Mar, 2023 19:12 IST|Sakshi

మథ్యూస్‌ ఆల్‌రౌండ్‌ షో.. ముంబై ఘన విజయం
మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ముంబై విజయభేరి మోగించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. కేవలం 14.2 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోయి చేధించింది.

ముంబై విజయంలో ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మాథ్యూస్ కీలక పాత్ర పోషించింది. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన మాథ్యూస్, బ్యాటింగ్‌లో 77 పరుగులతో ఆజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. మాథ్యూస్‌తో పాటు నాట్‌ స్కివర్‌ కూడా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడింది. 29 బంతులు ఎదుర్కొన్న స్కివర్‌ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 

ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్‌, ఇషాక్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో రిచా ఘోష్‌ 28 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22) పరుగులతో రాణించారు.

10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌  వికెట్‌ నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్(50), నాట్ స్కివర్(22) పరుగులతో ఉన్నారు.

6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్(31), నాట్ స్కివర్(0) పరుగులతో ఉన్నారు.

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 2 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్,యస్తికా భాటియా ఉన్నారు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్‌, ఇషాక్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో రిచా ఘోష్‌ 28 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22) పరుగులతో రాణించారు.

►18 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. క్రీజులో స్కాట్‌(14), రేణుకా సింగ్‌ ఉన్నారు.

►71 పరుగులు వద్ద ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన పెర్రీ రనౌట్‌ రూపంలో వెనుదిరిగింది. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో రిచాఘోష్‌, కనికా ఉన్నారు.

43 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో ఆర్సీబీ 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ కేవలం 43 పరుగులుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన(11), డివైన్‌(6),దిశా కసత్(0), నైట్‌(0) పెవిలియన్‌కు చేరారు. ముంబై బౌలర్లలో  హేలీ మాథ్యూస్, సైకా ఇషాక్ చెరో రెండు వికెట్లు సాధించారు.

2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(11), డివైన్‌(6) పరుగులతో ఉన్నారు.

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2023 తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. ఇప్పుడు బ్రబౌర్న్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బెంగళూరు మాత్రం ఒక మార్పు చేసింది. 

తుది జట్లు: 
ముంబై ఇండియన్స్ : యస్తికా భాటియా(వికెట్‌ కీపర్‌), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్‌), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, దిశా కసత్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), హీథర్ నైట్, కనికా అహుజా, మేగన్ షుట్, శ్రేయాంక పాటిల్, ప్రీతీ బోస్, రేణుకా ఠాకూర్ సింగ్

మరిన్ని వార్తలు