WPL 2023: అవార్డులు ఎవరికి? విన్నర్‌ ప్రైజ్‌మనీ ఎంతంటే! పీఎస్‌ఎల్‌ చాంపియన్‌ కంటే చాలా ఎక్కువ!

27 Mar, 2023 12:06 IST|Sakshi
ట్రోఫీతో ముంబై కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(PC: WPL)

Womens Premier League 2023: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌ విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్‌ అరంగేట్ర చాంపియన్‌గా రికార్డులకెక్కింది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి హర్మన్‌ సేన ఈ మేరకు చరిత్ర సృష్టించింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి డబ్ల్యూపీఎల్‌ ట్రోఫీని ముద్దాడి సంబరాల్లో మునిగిపోయింది.

మహిళా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రవేశపెట్టిన డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌ను మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. ఇక ఈ విజయంతో చాంపియన్‌ ముంబై, వివిధ విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లు గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?!

డబ్ల్యూపీఎల్‌-2023 అవార్డులు, ప్రైజ్‌మనీ
►విజేత- ముంబై ఇండియన్స్‌ వుమెన్‌- గోల్డెన్‌ ట్రోఫీ- రూ. 6 కోట్లు
►రన్నరప్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌- రూ. 3 కోట్లు
►మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌ హేలీ మాథ్యూస్‌(ముంబై ఇండియన్స్‌)- రూ. 5 లక్షలు
►ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు)- మెగ్‌ లానింగ్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌)- 9 ఇన్నింగ్స్‌లో 345 పరుగులు- రూ. 5 లక్షలు
►పర్పుల్‌ క్యాప్‌(అత్యధిక వికెట్లు)- హేలీ మాథ్యూస్‌(ముంబై ఇండియన్స్‌)- 16 వికెట్లు 

►ఫెయిర్‌ ప్లే అవార్డు- ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌
►క్యాచ్‌ ఆఫ్‌ ది సీజన్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(ముంబై)- యూపీ వారియర్జ్‌ దేవికా వైద్య క్యాచ్‌- రూ. 5 లక్షలు
►సఫారీ పవర్‌ఫుల్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌- సోఫీ డివైన్‌ (ఆర్సీబీ)- 8 ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు- రూ. 5 లక్షలు
►ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌- యస్తికా భాటియా(ముంబై)- రూ. 5 లక్షలు.

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ విజేత కంటే
మహిళా ప్రీమియర్‌ లీగ్‌ విజేతకు అందిన మొత్తం పీఎస్‌ఎల్‌ చాంపియన్‌ లాహోర్‌ కలందర్స్‌ గెల్చుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ విన్నర్‌గా అవతరించిన లాహోర్‌ రూ. 3.4 కోట్లు ప్రైజ్‌మనీ అందుకోగా.. రన్నరప్‌ ముల్తాన్‌ సుల్తాన్స్‌ సుమారు 1.37 కోట్ల రూపాయలు గెలుచుకుంది.

చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్‌.. రాహుల్‌కు షాక్‌.. భరత్‌కు చోటు
IPL 2023: ఐపీఎల్‌ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్‌ బాస్‌వే..!

మరిన్ని వార్తలు