WPL Auction 2023: మహిళల ఐపీఎల్‌ వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

1 Feb, 2023 16:49 IST|Sakshi

మహిళల ఐపీఎల్‌ (WPL)కు సంబంధించిన తొట్టతొలి వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న విధంగా వేలం ప్రక్రియను ఫిబ్రవరి తొలి వారంలో కాకుండా ఫిబ్రవరి 11, 13 తేదీల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

మెజార్టీ శాతం WPL ఫ్రాంచైజీలను (ఐదులో నాలుగింటిని) దక్కించున్న యాజమాన్యాలు దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో (ILT20) బిజీగా ఉండనుండటం వేలం తేదీల్లో మార్పులకు కారణంగా తెలుస్తోంది.

అందుకే ILT20 ఫైనల్‌ ముగిసాక ఈ తంతుని నిర్వహిం‍చాలని ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు బీసీసీఐని కోరాయట. ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. మరోవైపు వేలం ప్రక్రియను ఢిల్లీ లేదా ముంబై నగరాల్లో నిర్వహించే అవకాశం ఉంది. మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ముగిశాక మార్చి 4 - 24 మధ్యలో WPLను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 

WPLకు సంబంధించిన వివరాలు..

లీగ్‌లో మొత్తం జట్లు: 5
మ్యాచ్‌ల సంఖ్య (అంచనా): 22
వేదికలు (అంచనా): బ్రబౌర్న్‌ స్టేడియం (ముంబై), డీవై పాటిల్‌ స్టేడియం (ముంబై)

జట్లు తదితర వివరాలు..

1. అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అహ్మదాబాద్‌, 1289 కోట్లు)

2. ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ముంబై, 912.99 కోట్లు)

3. రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు, 901 కోట్లు)

4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఢిల్లీ, 810 కోట్లు)

5. క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (లక్నో, 757 కోట్లు)

మరిన్ని వార్తలు