Ellyse Perry: ఆసీస్‌ సుందరికి ఎంత కష్టమొచ్చే! 

16 Mar, 2023 16:36 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ ఎల్లిస్‌ పెర్రీ ప్రస్తుతం వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023) తొలి ఎడిషన్‌లో సందడి చేస్తుంది. ఆర్‌సీబీ వుమెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె బ్యాటింగ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. అయితే ఆమె మినహా మిగతావారు విఫలం కావడంతో ఆర్‌సీబీ వుమెన్‌ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసింది.

అయితే బుధవారం యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆర్‌సీబీ మంచి ప్రదర్శన కనబరిచి లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈసారి ఎల్లిస్‌ పెర్రీ బ్యాట్‌తో విఫలమైనప్పటికి బంతితో రాణించింది. కీలకమైన మూడు వికెట్లు తీసి యూపీ వారియర్జ్‌ను తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా చేసింది. ముఖ్యంగా తన దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ గుండెల్లో దడ పుట్టించిన గ్రేస్‌ హారిస్‌ వికెట్‌ తీసి జట్టుకు పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో కనికా అహుజా, రిచా ఘోష్‌లు రాణించడంతో ఆర్‌సీబీ విజయాన్ని అందుకుంది.

మ్యాచ్‌ గెలిచిన తర్వాత ఎల్లిస్‌ పెర్రీ గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి దీప్తిశర్మను కౌగిలించుకొని విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది.ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఎల్లిస్‌ పెర్రీ మాట్లాడింది. తన జట్టుకు అంటుకున్న రంగు ఇంకా పోలేదని.. దానివల్ల నాకు చిరాకు కలుగుతుందని ఎవరైనా సలహా ఇవ్వగలరా అని అడిగింది.

''ఇంట్లో ఎవరైనా ఉంటే నా జట్టుకు అంటుకున్న పింక్‌ కలర్‌ను పోగొట్టే చిట్కా చెప్పండి. మీరు చేసే పెద్ద సహాయం అదే. జుట్టుకున్న రంగును చూసినప్పుడల్లా నాకు ఏదో తెలియని చిరాకు కలుగుతుంది. హోలీ ఆడినప్పుడు బాగానే అనిపించింది కానీ జట్టుకు మాత్రం పింక్‌ కలర్‌ అలాగే ఉండిపోయింది. దయచేసి సాయం చేయండి.. అది పోగొట్టే మార్గం చెప్పండి'' అంటూ నవ్వుతూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఎల్లిస్‌ పెర్రీ సాయం కోరడంపై స్పందించిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు. ''నీలాంటి అందమైన క్రికెటర్‌ సలహా అడిగితే ఇవ్వకుండా ఉంటామా.. కచ్చితంగా ఇస్తాం''.. ''అందం, అభినయంతో పాటు ఆటతో మా మనుసుల గెలిచావ్‌.. నీకు ఆ మాత్రం సాయం చేయలేమా'' అంటూ పేర్కొన్నారు.

చదవండి: ఆడడంలో విఫలం.. తప్పు మీద తప్పు చేస్తూ

>
మరిన్ని వార్తలు