WPL Players Auction: 90 మందికే ఛాన్స్‌! కానీ 1000 పేర్లు నమోదు..

3 Feb, 2023 20:11 IST|Sakshi

ఆరంభ మహిళల ఐపీఎల్‌(డబ్ల్యూపీఎల్‌)కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగమయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెటర్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మహిళల ఐపీఎల్‌కు సంబంధించిన మొట్టమొదటి వేలం ముంబై వేదికగా ఫిబ్రవరి 13న బీసీసీఐ నిర్వహించనుంది. కాగా న్యూస్‌ 18 రిపోర్ట్‌ ప్రకారం.. ఈ వేలంలో పాల్గొనేందుకు దాదాపు 1000 మంది మహిళా క్రికెటర్లు తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

"అరంగేట్ర మహిళల ఐపీఎల్‌లో ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు ఆసక్తిగా ఉన్నారు. ఐపీఎల్‌ వేలం కోసం ఇప్పటికే 1000 మంది వరకు అమ్మాయిలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో భారత్‌తో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు" అని ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించినట్లు న్యూస్‌ 18 పేర్కొంది.

90 మందికే అవకాశం..
ఈ తొలి మహిళల ఐపీఎల్‌ సీజన్‌లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. ఒక్కో ప్రాంఛైజీకి 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసుకోనేందుకు బీసీసీఐ అనుమతించింది. అంటే మొత్తంగా 90 మంది మాత్రమే ఈ వేలంలో అమ్ముడుపోతారు.  90 స్థానాలకు ఇ​క మొత్తం ఐదు ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి ఆయా సంస్ధలు మొత్తంగా  రూ.4669.99 కోట్లను వెచ్చించాయి. 

మహిళల ఐపీఎల్‌ జట్లను కొనుగోలు చేసిన సంస్థలు ఇవే

1. అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అహ్మదాబాద్‌, 1289 కోట్లు)

2. ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ముంబై, 912.99 కోట్లు)

3. రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు, 901 కోట్లు)

4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఢిల్లీ, 810 కోట్లు)

5. క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (లక్నో, 757 కోట్లు)

మరిన్ని వార్తలు