భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌కు గాయం 

26 Jun, 2021 09:56 IST|Sakshi

మాస్కో: టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం గెలిచే భారత క్రీడాకారుల్లో ఒకరిగా భావిస్తున్న  స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా గాయపడ్డాడు. రష్యాలో జరుగుతున్న అలీ అలియెవ్‌ టోరీ్నలో భాగంగా అబ్దుల్‌ మజీద్‌ కుదేవ్‌ (రష్యా)తో జరిగిన 65 కేజీల విభాగం సెమీఫైనల్లో బజరంగ్‌ కుడి మోకాలి నొప్పితో బౌట్‌ మధ్యలోనే వైదొలిగాడు. మ్యాట్‌పైనే కుప్పకూలిన బజరంగ్‌కు ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత బజరంగ్‌ నిలబడినా నడవడానికి ఇబ్బంది పడ్డాడు. బజరంగ్‌ గాయం తీవ్రతపై ఒకట్రెండు రోజుల్లో వివరాలు చెబుతామని అతని కోచ్‌ షాకో తెలిపారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు