Wriddhiman Saha: త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..!

20 Jun, 2022 08:29 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ వృద్ధిమాన్ సాహా.. త్రిపుర జట్టుకు ప్లేయర్ కమ్ మెంటార్‌గా సేవలు అందించాడనికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాహా త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఏడాది శ్రీలంకతో స్వదేశంతో జరిగిన టెస్టు సిరీస్‌కు సాహాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో బ్యాకప్ వికెట్ కీపర్‌గా కెఎస్ భరత్‌ను మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. అప్పటి నుంచి సాహాను సెలక్టర్లు పక్కన పెట్టారు.

తాజాగా ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు కూడా సాహాను ఎంపిక చేయలేదు. కాగా జట్టు నుంచి ఉద్వాసన తర్వాత ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారిస్తాని గతంలో సాహా తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరుపున ఆడిన షా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 317 పరుగులు చేశాడు.

ఇక త్రిపుర తరపున షా ఆడాలనుకుంటే  'క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్' నుంచి ఖఛ్చితంగా నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలి.ఘీపై ఈ విషయాన్ని త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌తో బీసీసీఐ చర్చిస్తుంది. "వృద్ధిమాన్ సాహా త్రిపురకు ప్లేయర్-కమ్-మెంటర్‌గా వ్యవహరించాలని అనుకుంటున్నాడు. అతడు త్రిపుర అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఇంకా ఏమీ ఖరారు కాలేదు" అని  ఎన్డీటీవీతో బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
చదవండిSL vs AUS: ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..!

మరిన్ని వార్తలు