WTA Womens Singles 2022: ఛాంపియన్‌గా గార్సియా.. మౌరెస్మో తర్వాత తొలి ఫ్రాన్స్‌ క్రీడాకారిణిగా రికార్డు

9 Nov, 2022 08:38 IST|Sakshi

టెక్సాస్‌: మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ క్రీడాకారిణి కరోలినా గార్సియా చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ గార్సియా 7–6 (7/4), 6–4తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సబలెంకా (బెలారస్‌)పై గెలిచింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో అమెలీ మౌరెస్మో (2005లో) తర్వాత సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన రెండో ఫ్రాన్స్‌ క్రీడాకారిణిగా గార్సియా గుర్తింపు పొందింది.

విజేతగా నిలిచిన గార్సియాకు 15 లక్షల 70 వేల డాలర్ల (రూ. 12 కోట్ల 76 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1,375 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. తాజా విజయంతో గార్సియా, సబలెంకా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాల చొప్పున మెరుగుపర్చుకొని వరుసగా నాలుగు, ఐదు ర్యాంక్‌ల్లో నిలిచారు.

మరిన్ని వార్తలు