WTC ఫైనల్‌: నాలుగో రోజు వర్షార్పణం

21 Jun, 2021 19:41 IST|Sakshi

వరుణుడు కారణంగా నాలుగో రోజు ఆట రద్దు

ఇక మ్యాచ్‌ ఫలితం తేలడం కష్టమేనంటున్న క్రికెట్‌ విశ్లేషకులు

సౌతాంఫ్టన్‌: ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌ పైనల్‌కు వరుణుడు అడ్డంగా మారాడు. ఇక నాలుగో రోజైన సోమవారం ఆట ప్రారంభమవుతుందని ఆశించిన ప్రేక్షకుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ మెగా ఫైనల్‌కు వేదికైన సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి వర్షం కురవడంతో పిచ్‌పై కప్పిన కవర్లపై నీరు నిలిచిపోయింది.

దీంతో పాటు ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. ఈ క్రమంలోనే నాల్గో రోజు మ్యాచ్‌ జరిగే సూచనలు లేవని ఫీల్డ్‌ ఎంపైర్లు తెలపడంతో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఫలితంగా నాలుగో రోజు ఆట వర్షార్పణం అయ్యింది. 

చదవండి: WTC ఫైనల్‌: విరాట్ కోహ్లి డ్యాన్స్‌ అదిరిందిగా!

మరిన్ని వార్తలు