నా జీవితంలో పెళ్లి తర్వాత చాలా మార్పులొచ్చాయి: బుమ్రా 

17 Jun, 2021 11:20 IST|Sakshi

లండన్‌: టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తరపున కీలక బౌలర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వ్యక్తిగత కారణాలతో మధ్యలోనే వైదొలిగిన బుమ్రా న్యూస్‌ ప్రెజెంటర్‌ సంజనా గణేషన్‌ను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలాసార్లు పంచుకున్నారు. తాజాగా ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సమాయత్తమవుతున్న బుమ్రాను తన భార్య సంజనా గణేషన్‌ ఇంటర్య్వూ చేసిన వీడియోను ఐసీసీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఈ వీడియోలో తన చిన్ననాటి విషయాలతో పాటు పెళ్లి తర్వాత తన జీవితంలో జరిగిన మార్పుల గురించి చెప్పుకొచ్చాడు. చిన్నప్పుడు చెల్లితో క్రికెట్‌ ఆడడం.. ఆ తర్వాత స్కూల్‌ దశలో ఆడిన రోజులను ఎప్పటికి మరిచిపోను. ఇక పెళ్లి తర్వాత మరో కొత్త జీవితం మొదలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అని చెప్పుకొచ్చాడు.

అంతకముందు బుమ్రా ఇంట‌ర్వ్యూకి వ‌స్తున్న స‌మ‌యంలో సంజన అక్క‌డ రెడీగా ఉండడంతో .. ''ఇంత‌కుముందు నిన్నెక్క‌డో చూశానంటూ నవ్వాడు. దానికి ఆమె ''నేను ఇక్క‌డే ఉంటాను'' అని చెప్పింది. ఇంట‌ర్వ్యూలో ఎలా మాట్లాడాలి, త‌న‌ను తాను ఎలా ప‌రిచ‌యం చేసుకోవాలో కూడా బుమ్రాకు సంజ‌న వివ‌రించింది. ఆ త‌ర్వాత తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మ‌రుపురాని ఫొటోలను బుమ్రాకు చూపిస్తూ వాటి గురించి చెప్పాల‌ని అడిగింది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీతో ఉన్న ఫొటో, తాను గిటార్ వాయిస్తున్న ఫొటో, సంజ‌న‌తో పెళ్లి ఫొటోల గురించి బుమ్రా వివరించాడు. త‌న పెళ్లి ఫొటోను చూస్తూ ఇది త‌న జీవితంలో మ‌రుపురాని రోజు అని, ఈ మ‌ధ్యే ఈ అద్భుతం జ‌రిగింద‌ని బుమ్రా సంజనతో చెప్పుకొచ్చాడు. పెళ్లి రిత్యా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అనంతరం ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున బరిలోకి దిగిన బుమ్రా 7 మ్యాచ్‌లాడి 6 వికెట్లు తీశాడు. 


చదవండి: బుమ్రా ఆ ఘనతను కచ్చితంగా సాధిస్తాడు: మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు