WTC Final: భారత జట్టు ఇదే.. బీసీసీఐ ప్రకటన

15 Jun, 2021 19:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్ట్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. జూన్‌ 18న ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో మొదలయ్యే ఈ మెగా టోర్నీలో భాగస్వామ్యమయ్యే ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. కాగా ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడుతూ భారత ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో సమరానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే భారత జట్టు:
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, వృద్ధిమాన్‌ సాహా.

మయాంక్‌, వాషింగ్టన్‌ సుందర్‌కు నిరాశే..
15 మంది సభ్యులతో కూడిన జట్టులో శుభ్‌మన్‌ గిల్‌(ఓపెనర్‌) పేరు ఉన్న నేపథ్యంలో మయాంక్‌ అగర్వాల్‌కు నిరాశే మిగిలింది. అతడితో పాటు, స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అక్షర్‌ పటేల్‌(27 వికెట్లు‌), ఆసీస్‌ టూర్‌లో ఆకట్టుకున్న వాషింగ్టన్‌ సుందర్‌, మరో ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌కు కూడా మొండిచేయి ఎదురైంది. ఇదిలా ఉంటే.. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ప్రాక్టీసు మ్యాచ్‌లలో అదరగొడుతున్న నేపథ్యంలో సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు సన్నగిల్లాయి.

చదవండి: WTC Final: ‘టీమిండియా ఓడిపోతుంది; నీ పని అయిపోయింది.. ఇక వెళ్లు’!
 WTC Final: బౌన్సర్‌ ఆడలేకపోయిన కోహ్లి .. పంత్‌ సిక్సర్ల జోరు

మరిన్ని వార్తలు