WTC Final: మూడు సార్లు టెస్టులు.. 14 రోజుల క్వారంటైన్‌

15 May, 2021 22:12 IST|Sakshi

ముంబై: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం బీసీసీఐ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఆటగాళ్లు, కోచింగ్‌ సహాయ సిబ్బంది మే 19న ముంబైలో సమావేశంకానున్నారు. కాగా  ఆటగాళ్లందరూ మూడు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకునే ఏర్పాట్లను బీసీసీఐ వర్గం తెలిపింది

‘ఆటగాళ్లు వారి ఇంటి వద్దే మూడు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకుంటారు. నెగెటివ్‌ వచ్చిన తర్వాత మే 19న ముంబైలో ఒక దగ్గరికి చేరుతారు. జూన్‌ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరే ముందు ప్రతి ఒక్కరూ భారత్‌లోనే 14 రోజుల క్వారంటైన్‌లో ఉంటారని’  వెల్లడించింది.

కాగా మూడు నెలలకు పైగా సాగే పర్యటన కోసం బయల్దేరే క్రికెటర్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులకు 20 మందితో బోర్డు జట్టును ప్రకటించింది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌  టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా జరగనుంది. 
చదవండి: అవన్నీ తప్పుడు వార్తలు.. నేను ఎప్పుడు సిద్ధమే: భువీ 

మరిన్ని వార్తలు