ఐసీసీ పోస్టర్‌లో కుంబ్లే ఫీట్‌కు దక్కని చోటు

18 Jun, 2021 15:47 IST|Sakshi

లండన్: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను పురస్కరించుకుని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆవిష్కరించిన ఓ పోస్టర్‌ వివాదాస్పదంగా మారింది. 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోని గ్లింప్సెస్‌ను పొందుపరుస్తూ ఐసీసీ రూపొందించిన ఈ పోస్టర్‌లో భారత లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేకు చోటు దక్కకపోవడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుంబ్లే 1998-99లో పాక్‌పై సాధించిన 10 వికెట్ల ఫీట్‌ను ఐసీసీ పరిగణలోకి తీసుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఈ చర్య కుంబ్లేను ఉద్దేశపూర్వకంగా అవమానించినట్టేనంటూ ఊగిపోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ అంశాన్ని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా, 1877లో మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్ మొదలుకుని.. నేటి డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు సేకరించిన కొన్ని గ్లింప్సెస్‌తో ఐసీసీ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.  ఇందులో దిగ్గజ ఆటగాళ్లు షేన్ వార్న్, అండర్సన్, ముత్తయ్య మురళీధరన్, ఇమ్రాన్ ఖాన్, జాక్వెస్ కల్లిస్, సచిన్ టెండుల్కర్, స్టీవ్ వా, షకీబుల్ హసన్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్‌ తదితర దిగ్గజాల ఫొటోలను ముద్రించింది. ఈ విషయంలో ఐసీసీ ప్రయత్నం మెచ్చుకోదగ్గదే అయినప్పటికీ.. కొన్ని అరుదైన ఫీట్లను విస్మరించడం వివాదాస్పదంగా మారింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదుగా చెప్పుకునే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ఘనత సాధించిన అనిల్ కుంబ్లేకు చోటు లభించకపోవడంపై భారతీయ అభిమానులు ఊగిపోతున్నారు. 
చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే

మరిన్ని వార్తలు