WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే టీమిండియా తుదిజట్టు ఇదే!

17 Jun, 2021 20:10 IST|Sakshi

న్యూఢిల్లీ: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడే తుదిజట్టును టీమిండియా ప్రకటించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారథ్యంలో ఫైనల్‌ ఆడే పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత జట్టు బరిలో దిగనుంది. ఈ మేరకు బీసీసీఐ గురువారం ట్వీట్‌ చేసింది. కాగా శుక్రవారం(జూన్‌ 18) నుంచి ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ఆరంభం కానుంది.

ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించడమే గాక, స్వదేశంలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి వరుస సిరీస్‌లు గెలుచుకున్న ఉత్సాహంలో టీమిండియా ఉండగా.. ఫైనల్‌కు ముందు రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో కివీస్‌ ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీలో తుదిపోరును తిలకించేందుకు క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే భారత జట్టు
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ.

చదవండి: WTC Final: డబ్ల్యూటీసీ ట్రోఫీ టీమిండియాదే: గంగూలీ

మరిన్ని వార్తలు