అశ్విన్‌ టాప్‌, రహానే కంటే రోహిత్‌.. వార్నర్‌ బాదుడు కూడా!

24 Jun, 2021 10:45 IST|Sakshi

టీమిండియాను చిత్తు చేసి టెస్ట్‌ క్రికెట్‌ ఛాంపియన్‌ టోర్నీ తొలి విజేతగా న్యూజిలాండ్‌ ఆవిర్భవించింది. ఈ తరుణంలో డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్‌లో ఓవరాల్‌గా ఆటగాళ్ల ఫర్‌ఫార్మెన్స్‌ చూసుకుంటే.. 

50 దాటలే.. 
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఒక్క టీమిండియన్‌ బ్యాట్స్‌మ్యాన్‌ అర్థ సెంచరీ కొట్టలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే సాధించిన 49 పరుగులే హయ్యెస్ట్‌. భారత ప్లేయర్స్‌ సగటు 18.55. మొత్తం పరుగులు 371(ఎక్స్‌ట్రాలను మినహాయిస్తే). ఇక స్ట్రయిక్‌ రేట్‌ 37.22 గా ఉంది. ఈ రేట్‌పై క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు పెదవి విరుస్తున్నారు. 

 మోస్ట్‌ రన్స్‌ 
డబ్ల్యూటీసీ ఫస్ట్‌ ఎడిషన్‌ టాప్‌ 5లో ఇద్దరు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌, ఇద్దరు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఉండగా ఒక టీమిండియా బ్యాట్స్‌మన్‌ ఉన్నాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ లబూషేన్‌ 13 మ్యాచ్‌ల్లో 1676 పరుగులతో టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు. ఆ ఆ తర్వాత జో రూట్‌(20 మ్యాచ్‌ల్లో 1660), స్టీవ్‌ స్మిత్‌(13 మ్యాచ్‌లు 1341 పరుగులు), బెన్ స్టోక్స్(17 మ్యాచ్‌లు 1334పరుగులు), అజింక్య రహానే (18 మ్యాచ్‌లు 1174 పరుగులు) టాప్‌ 5లో ఉన్నారు.

రహానేనే టాప్‌.. కానీ
ఇక డబ్ల్యూటీసీ టోర్నీ మొత్తంగా చూసుకుంటే టీమిండియా తరఫున 18 మ్యాచ్‌ల్లో మూడు శతకాలతో  1174 పరుగులు సాధించిన రహానే టాప్‌ పొజిషన్‌లో నిలిచాడు. అజింక్య రహానే. స్వదేశీ గడ్డపై మాత్రమే కాదు.. విదేశాల్లో రహానే పర్‌ఫార్మెన్స్‌ టాప్‌గా ఉంది. విదేశీ గడ్డపై ఆడిన 9 మ్యాచ్‌ల్లో 694 పరుగులతో(రెండు సెంచరీ)లతో టాప్‌ పొజిషన్‌లో నిలిచాడు. ఇక రోహిత్‌ శర్మ 12 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 2 అర్థసెంచరీలతో (ఒక డబుల్‌ సెంచరీ కూడా) 1094 పరుగులు సాధించాడు. రోహిత్‌ యావరేజ్‌ 60.77 ఉండగా, దరిదాపుల్లో ఏ టీమిండియా ప్లేయర్‌ కూడా లేకపోవడం విశేషం. 

మోస్ట్‌ వికెట్స్‌
ఎక్కువ వికెట్లు దక్కించుకున్న ఘనత టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు దక్కింది. 14 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు సాధించాడు అశ్విన్‌. ఇక తర్వాతి ప్లేసులో ప్యాట్‌ కమ్మిన్స్‌ 14 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు, స్టువర్ట్‌ బ్రాడ్‌ 17 మ్యాచ్‌ల్లో 69, టిమ్‌ సౌతీ 11 మ్యాచ్‌ల్లో 56, నథాన్‌ లైయోన్‌ 14 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు దక్కించుకున్నారు. 

వార్నర్‌ భాయ్‌ హయ్యెస్ట్‌
ఇక 2019లో పాక్‌ను ఉతికారేసి డేవిడ్‌ వార్నర్‌ సాధించిన 335 పరుగులు హయ్యెస్ట్‌ వ్యక్తిగత స్కోర్‌గా నిలిచింది. శ్రీలంక బౌలర్‌ లసిత్‌ ఎంబుల్‌దెనియా ఈ ఏడాది ఇంగ్లండ్‌ పై దక్కించుకున్న 137-7 వికెట్లు బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్‌గా నిలిచింది. 

న్యూజిలాండ్‌ తరపున టిమ్‌ సౌతీ మొత్తం పదకొండు మ్యాచ్‌ల్లో  56 వికెట్లు తీశాడు. 20.82 సగటుతో కివీ బౌలర్లలో హయ్యెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా  నిలిచాడు.

చదవండి: రిజర్వ్‌ డే కలిపినా కష్టమే!

>
మరిన్ని వార్తలు