వార్న్‌కు స్పిన్‌ పాఠాలు.. నవ్వాపుకోలేకపోయిన సెహ్వాగ్‌

20 Jun, 2021 10:22 IST|Sakshi

సౌతాంప్ట‌న్‌: లెజెండరీ స్పిన్న‌ర్ల‌లో ఒకడిగా పేరుపొందిన షేన్ వార్న్‌కు ఒక అభిమాని స్పిన్ పాఠాలు చెప్పడం వైరల్‌గా మరింది. విషయంలోకి వెళితే.. భారత్‌, న్యూజిలాండ్ మ‌ధ్య ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్‌ జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు న్యూజిలాండ్ జట్టు ఒక్క స్పిన్న‌ర్‌ను కూడా తీసుకోకుండా బ‌రిలోకి దిగింది. దీనిని త‌ప్పుబ‌డుతూ షేన్ వార్న్ ఓ ట్వీట్ చేశాడు.

''ఫైన‌ల్లో న్యూజిలాండ్ స్పిన్న‌ర్‌ను ఆడించ‌క‌పోవ‌డం చాలా నిరాశ‌ క‌లిగించింది. ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలించ‌నుంది. ఇప్ప‌టికే పిచ్‌పై అడుగుల మ‌ర‌క‌లు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. స్పిన్ అయ్యేలా క‌నిపిస్తోందంటే క‌చ్చితంగా అవుతుంది. ఇండియా 275/300 కంటే ఎక్కువ‌ చేసిందంటే మ్యాచ్ ముగిసిన‌ట్లే'' అని వార్న్ ట్వీట్ చేశాడు. కాగా వార్న్‌ ట్వీట్‌పై ఓ అభిమాని రిప్లై ఇచ్చాడు. '' షేన్ అస‌లు స్పిన్ ఎలా అవుతుందో నీకు తెలుసా? పిచ్ పొడిగా మారితేనే.. కానీ ఇక్క‌డ వ‌ర్షం కారణంగా పిచ్ పొడిగా మారే అవ‌కాశ‌మే లేదు'' అని ట్వీట్ చేశాడు. వార్న్‌కు అభిమాని ఇచ్చిన రిప్లైపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించాడు. '' ఆల్‌టైమ్‌ దిగ్గజ స్పిన్నర్లలో ఒకడిగా పేరు పొందిన షేన్‌ వార్న్‌కే స్పిన్‌ పాఠాలు చెబుతున్నావు. ఇది నా నవ్వును ఆపలేకపోతుంది. షేన్ అస‌లు స్పిన్ ఎలా అవుతుందో తెలుసుకో అంటూ'' లాఫింగ్ ఎమోజీల‌ను షేర్‌ చేస్తూ కామెంట్‌ చేశాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఆటలో తొలిరోజు వర్షార్పణం కాగా.. రెండో రోజు ఆట వెలుతురులేమితో 66.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (124 బంతుల్లో 44 బ్యాటింగ్‌; 1 ఫోర్‌), అజింక్య రహానే (79 బంతుల్లో 29 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.

చదవండి: WTC Final: కివీస్‌కు ఫీల్డ్‌ అంపైర్ సాయం‌.. ఫ్యాన్స్‌ ఆగ్రహం

కోహ్లిని ఔట్‌ చేయాలంటే ఇలా చేయాల్సిందే: స్టెయిన్‌

మరిన్ని వార్తలు