IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌! స్టార్‌ ఆటగాడు దూరం

24 Nov, 2022 08:40 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బంగ్లాతో వన్డే సిరీస్‌తో పాటు టెస్టులకు కూడా దూరమయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మోకాలి గాయం బారిన పడిన జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలోనే బంగ్లాతో వన్డే సిరీస్‌కు జడ్డూ దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. అదే విధంగా టెస్టులకు కూడా జడేజా దూరమయ్యే అవకాశం ఉంది.

దీంతో అతడి స్థానంలో వన్డేలకు ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ను బీసీసీఐ సీనియర్ సెలక్షన్‌ కమిటీ భర్తీ చేసింది. ఇక యువ పేసర్‌ యాష్‌ దయాల్‌ కూడా వెన్ను నొప్పి కారణంగా బంగ్లాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో యువ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ ఎంపికయ్యాడు.

మరోవైపు బంగ్లాదేశ్‌తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లకు 13 మంది సభ్యలతో కూడిన భారత్‌-ఏ జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా భారత వెటరన్‌ ఆటగాళ్లు ఛెతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించకున్నారు. నవంబర్‌ 29న ఇరుజట్ల మధ్య తొలి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఇక  డిసెంబర్‌ 4న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది.

బంగ్లాదేశ్ వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్‌  షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్.

తొలి నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్‌), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్‌ కీపర్‌), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ షెత్

రెండో నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్‌), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్ (వికెట్‌ కీపర్‌), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ శేథ్, ఛెతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్, కేఎస్‌ భరత్
చదవండి: IPL 2023 Mini Auction: సన్‌రైజర్స్‌లోకి బెన్‌ స్టోక్స్‌.. కెప్టెన్‌ కూడా అతడే..?

మరిన్ని వార్తలు