యార్క్‌షైర్‌ కౌంటీపై వేటు

6 Nov, 2021 05:33 IST|Sakshi

అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆతిథ్యానికి హెడింగ్లీ మైదానం దూరం

జాతి వివక్షపై ఈసీబీ కఠిన చర్యలు

లండన్‌: జాతి వివక్షపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కన్నెర్ర చేసింది. కుప్పలుతెప్పలుగా ఆరోపణలు వస్తున్నా... చర్యలు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించిన యార్క్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ (వైసీసీసీ)పై సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో ఆ జట్టు కౌంటీలకు దూరమవడంతో పాటు క్లబ్‌కు చెందిన హెడింగ్లీ స్టేడియంలో ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు జరగవు. వచ్చే ఏడాది లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియంలో పలు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.

న్యూజిలాండ్‌తో మూడో టెస్టు, దక్షిణాఫ్రికాతో వన్డే, యాషెస్‌ సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ను అక్కడి నుంచి తప్పిస్తారు. వైసీసీసీకి చెందిన మాజీ క్రికెటర్‌ అజీమ్‌ రఫీక్‌ (2008–2018) ఏళ్ల తరబడి వర్ణ వివక్షకు గురయ్యాడు. ఇస్లాం మతానికి చెందిన తను పదేపదే వివక్షకు గురయ్యానని, సహచరులు తనను బయటివాడిగానే చూసేవారని, దీనిపై క్లబ్‌కు 43 సార్లు ఫిర్యాదు చేశానని రఫిక్‌ గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈసీబీ రంగంలోకి దిగింది. కమిటీ విచారణలో యార్క్‌షైర్‌ ఉదాసీనత వెలుగులోకి వచ్చింది. వెంటనే ఈసీబీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. 

మరిన్ని వార్తలు