YouGov Survey 2021: అత్యంత ఆరాధించబడే పురుషుల జాబితాలో సచిన్‌, కోహ్లి..

15 Dec, 2021 21:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించబడే టాప్‌-20 పురుషుల జాబితాలో టీమిండియా టెస్ట్‌ కెప్టెన్ విరాట్ కోహ్లి చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో పరుగుల యంత్రం కోహ్లి 18వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ(8వ స్థానం), క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్(12వ స్థానం), బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(14), బిగ్‌ బీ అమితాబ్‌(15) ఉన్నారు. 2021 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక YouGov సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలువగా.. మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ రెండులో, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ మూడో స్థానంలో నిలిచారు. 


క్రీడాకారుల్లో కోహ్లితో పాటు దిగ్గజ ఫుట్‌బాలర్లు క్రిస్టియానో​ రొనాల్డో(4), లియోనెల్ మెస్సీ(7)లు ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక, మహిళల విభాగంలో అత్యంత ఆరాధించే ప్రముఖుల్లో అమెరికా మాజీ ప్రథమ మహిళ, బరాక్‌ ఒబామా భార్య మిచెల్‌ ఒబామా తొలి స్థానంలో నిలువగా.. హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ, క్వీన్‌ ఎలిజబెత్‌-2 వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత్‌ నుంచి బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా(10), మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌(13), ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి(14)లకు చోటు దక్కింది. YouGov సంస్థ ఈ జాబితాను మంగళవారం(డిసెంబర్‌ 14) విడుదల చేసింది.
చదవండి: వన్డే కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన బీసీసీఐ.. ముదురుతున్న వివాదం

మరిన్ని వార్తలు