రైట్‌ ఆర్మ్‌ క్విక్‌ బౌలరా.. కోహ్లి ఏంటిది!

4 Nov, 2020 19:45 IST|Sakshi

దుబాయ్‌ : విరాట్‌ కోహ్లి.. క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. టీమిండియా కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా విజయవంతంగా కొనసాగుతున్నాడు. కానీ ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌సీబీకి టైటిల్‌ అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరిన ఆర్‌సీబీ శుక్రవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. దీంతో ఎలాగైనా ఎలిమినేటర్‌ మ్యాచ్‌ గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టాలని ఆర్‌సీబీ భావిస్తుంది. (చదవండి : 'ప్లే ఆఫ్‌ ఆడకు.. అప్పుడే నీ విలువ తెలుస్తుంది')

ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. ఐసీసీ తమ ట్విటర్‌లో ఒక వినూత్న వీడియోతో ముందుకొచ్చింది. ఇప్పటితరం మీ ఫేవరెట్‌ సూపర్‌స్టార్‌ ఆటగాళ్లు అండర్‌ 19 ప్రపంచకప్‌లో ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూడండి. అలాగే మీరు ఇష్టపడే ఆటగాడు ఎవరో కూడా చెప్పండి అంటూ పేర్కొంది. కాగా అప్పటి అండర్‌-19 టీమిండియా జట్టుకు అప్పటి యంగ్‌ విరాట్‌ కోహ్లినే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా..' హాయ్‌ .. దిస్‌ ఈజ్‌ విరాట్‌ కోహ్లి.. కెప్టెన్‌.. రైట్‌ హ్యాండ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌.. రైట్‌ ఆర్మ్‌ క్విక్‌ బౌలర్‌.. మై ఫేవరెట్‌ బ్యాట్స్‌మెన్‌ హర్షలే గిబ్స్‌' అంటూ ముగించాడు. (చదవండి : ‘ఇండియా కంటే ఐపీఎల్‌ ఆడటమే ముఖ్యమా?!’)

అయితే విరాట్‌ కోహ్లి బౌలింగ్‌ డిస్క్రిప్షన్‌పై నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్‌ చేశారు. కోహ్లి తన బౌలింగ్‌ శైలిని రైట్‌ ఆర్మ్‌ బౌలర్‌ అని చెప్పాల్సింది పోయి.. రైట్‌ ఆర్మ్‌ క్విక్‌ బౌలర్‌ అని చెప్పడం ఏంటంటూ ట్రోల్‌ చేశారు. ఇలాంటి బౌలింగ్‌ శైలి కూడా ఉంటుందా.. ఏదైనా మా కోహ్లికే సాధ్యం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఈ వీడియోలో ఇప్పటి ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌ స్మిత్‌తో పాటు రవీంద్ర జడేజా(టీమిండియా), మనీష్‌ పాండే( టీమిండియా), కీరన్‌ పావెల్‌( వెస్టిండీస్‌), జేమ్స్‌ పాటిన్సన్‌(ఆస్ట్రేలియా), ఇమాద్‌ వసీమ్‌(పాకిస్తాన్‌), డ్వేన్‌ బ్రావో(వెస్టిండీస్‌), వేన్‌ పార్నెల్‌(దక్షిణాఫ్రికా) తదితరులు తమను తాము పరిచయం చేసుకున్నారు. కాగా 2008 అండర్‌ 19 ప్రపంచకప్‌ను కోహ్లి సారధ్యంలోని టీమిండియా గెలుచుకుంది. ఈ ప్రదర్శనతోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లికి అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. (చదవండి : 'ధోని ఇంపాక్ట్‌ ఎంత అనేది అ‍ప్పుడు తెలిసింది')

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు