'నా లిస్ట్‌లో సూర్య పేరు కచ్చితంగా ఉంటుంది'

20 Mar, 2021 11:42 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో మెరుపు అర్థశతకంతో రాణించిన సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. తాజాగా భారత మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సూర్యకుమార్‌ను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య నీ ఆటతీరు అమోఘం. ఐపీఎల్‌లో ఎలా అయితే ఆడావో.. అదే ఆటతీరును ఇక్కడ ప్రదర్శించావు. క్రీజులోకి వచ్చీ రావడంతోనే సిక్సర్‌ కొట్టి ఒత్తిడిని అధిగమించావు. నీలాంటి డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ సేవలు ఇప్పుడు జట్టుకు అవసరం. టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి నేను ప్రకటించే లిస్టులో సూర్యకుమార్‌కు కచ్చితంగా స్థానం ఉంటుంది. అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా సూర్యకుమార్‌ ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో మూడో స్థానంలో వచ్చి 31 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అయితే ఒక వివాదాస్పద నిర్ణయానికి సూర్య బలి కావాల్సి వచ్చింది. స్యామ్‌ కరన్‌ వేసిన 14వ ఓవర్‌ తొలి బంతిని స్వీప్‌షాట్‌తో లెగ్‌సైడ్‌ సిక్సర్‌ బాదిన యాదవ్‌ తర్వాత బంతిని అలాగే ఆడాడు. కానీ ఫైన్‌లెగ్‌లో మలాన్‌ క్యాచ్‌పట్టాడు. అయితే బంతి అతని చేతుల్లో పడీపడగానే నేలనీ తాకింది. టీవీ అంపైర్‌ పలుమార్లు రీప్లే చేసి నిమిషాలపాటు చూసి ఫీల్డ్‌ అంపైర్‌ ఇచ్చిన ‘సాఫ్ట్‌ సిగ్నల్‌ అవుట్‌’కే మొగ్గుచూపడంతో సూర్యకుమార్‌ క్రీజు వీడాడు. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్‌లో 2-2తో సమానంగా ఉన్న ఇరు జట్లకు నేడు జరగనున్న చివరి టీ20 కీలకంగా మారింది.
చదవండి:
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌: సూర్య కుమార్‌కు పిలుపు
'ఆడడమే నా పని.. ఔట్‌ నా చేతుల్లో ఉండదు'


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు