బెన్‌ స్టోక్స్‌ ముందు యువరాజ్‌ !

8 Oct, 2020 10:54 IST|Sakshi

న్యూఢిల్లీ: యువరాజ్‌ సింగ్‌ అసలు ఐపీఎల్‌లో ఆడడం లేదు. బెన్‌ స్టోక్స్‌ ఇప్పటివరకు ఐపీఎల్‌లో అందుబాటులో లేడు. మరి ఏంటీ బెన్‌ స్టోక్స్‌ ముందు యువరాజ్‌... తెలియాలంటే వారి ట్వీట్స్‌ చదవాల్సిందే. కోల్‌కత జట్టుకు ఎప్పుడూ ఓపెనర్‌గా బ్యాటింగ్‌ చేసే సునిల్‌ నరైన్‌ బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో ఆడాడు. తన స్థానంలో రాహుల్‌ త్రిపాఠి బరిలోకి దిగాడు. ఐదో స్థానంలో ఇయాన్‌ మోర్గాన్‌ బ్యాటింగ్‌ చేశాడు. ఈ విషయమై రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ స్పందించాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మోర్గాన్‌ కంటే ముందు నరైన్‌ను పంపడాన్ని ప్రశ్నిస్తూ...'మోర్గాన్‌ ముందు నరైన్‌??' అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు యువరాజ్‌ సింగ్‌ ఫనీ​గా స్పందించాడు. 'స్టోక్స్‌ ముందు యువరాజ్‌ !' కొన్నిసార్లు ఒక మంచి బ్యాట్స్‌మెన్‌ ముందు బౌలింగ్‌ చేసే ఆల్‌రౌండర్ల్‌ను పంపించే అవకాశం ఇవ్వాలని' ట్వీట్‌ చేశాడు. యువరాజ్‌, స్టోక్స్‌ మంచి బ్యాట్స్‌మెన్స్‌... ఇద్దరూ బౌలింగ్‌లో కూడా సత్తా చాటగలరు. కానీ యువరాజ్‌ ఈ ట్వీట్‌ ద్వారా తనను తాను ఒక బౌలర్‌గా అభివర్ణించుకున్నాడు.

బెన్‌ స్టోక్స్‌ తన తండ్రి అనారోగ్యం కారణంగా ఐపీఎల్‌లో మొదటి ఐదు మ్యాచులు ఆడలేకపోయాడు. బుధవారం యూఏఈకి చేరుకుని క్వారంటైన్‌లో ఉన్నాడు. రాజస్థాన్‌ జట్టు గత మూడు మ్యాచులు ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ సమయంలో స్టోక్స్‌ అందుబాటులో ఉండడం ఆ జట్టుకు మంచి పరిణామం.

మరిన్ని వార్తలు