మ‌న‌సు మార్చుకున్న యూవీ.. ఎందుకంటే

9 Sep, 2020 22:07 IST|Sakshi

ముంబై : జూన్ 10, 2019.. టీమిండియా ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలి ఆట‌కు వీడ్కోలు ప‌లికిన రోజు. స‌రిగ్గా 14 నెల‌ల త‌ర్వాత యువ‌రాజ్ త‌న మ‌న‌సు మార్చుకున్న‌ట్లుగా అనిపిస్తుంది.తాజాగా రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుని  పంజాబ్ క్రికెట్‌లో డ‌మ‌స్టిక్ లీగ్‌లు ఆడాలని భావిస్తున్నాడు. అలా మెల్లిగా మిగతా ఫార్మాట్లలోనూ బరిలో దిగనున్నట్లు తెలుస్తున్నది. అనుభవజ్ఞుడైన యువీ సేవలు రంజీ జట్టుకు అవసరమని..జట్టులో ఆటగాడిగా ఉంటూనే యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించాలని పంజాబ్‌ క్రికెట్‌ సంఘం ఇంత‌కముందు యూవీని కోరిన విషయం తెలిసిందే.( చ‌ద‌వండి :  6 నెల‌ల త‌ర్వాత తొలిసారి విమానం ఎక్కా)

గతంలో తాను ప్రకటించిన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బుధ‌వారం యువ‌రాజ్‌ బీసీసీఐకి  ‌లేఖ  రాశాడు. ఈ విష‌యాన్ని యూవీ స్వ‌యంగా వెల్ల‌డించాడు.  త‌న రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకొని దేశీయ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ,  కార్యదర్శి జై షాకు లేఖ రాసినట్లు తెలిపాడు ఒకవేళ యువీకి అనుమతి లభిస్తే మళ్లీ విదేశీ లీగ్‌ల్లో  పాల్గొనేందుకు అతనికి అవకాశం ఉండదు. కాగా యువ‌రాజ్‌..  బిగ్‌బాష్ లీగ్‌లో ఆడ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలోనే యూవీ ఇలా యూట‌ర్న్ తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

2000వ సంవ‌త్స‌రంలో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన యువ‌రాజ్ అన‌తికాలంలోనే భార‌త క్రికెట్‌లో త‌నదైన ముద్ర వేశాడు. మంచి ఆల్‌రౌండ‌ర్‌గా పేరు పొందిన యూవీ, టీమిండియా.. 2007 టీ20, 2011 ప్ర‌పంచ‌క‌ప్‌లు సాధించ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2011 ప్ర‌పంచ‌క‌ప్ యూవీ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. (చ‌ద‌వండి : వామ్మో రోహిత్‌.. ఇంత క‌సి ఉందా!)

మరిన్ని వార్తలు