కాళ్లకు రంగు షూలు.. తలకు పచ్చటోపీ; నీ వేషదారణ చూడలేకపోతున్నాం

13 Jul, 2021 14:03 IST|Sakshi

లండన్‌: టీమిండియా క్రికెటర్‌ ఇషాంత్‌ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లు వినోదంలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఇషాంత్‌ శర్మ గోల్ఫ్‌ ఆడడంపై యువీ తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు. అయితే యువీ ట్రోల్‌ చేసింది లంబూ ఆటను అనుకుంటే పొరపాటే... అతను ట్రోల్‌ చేసింది ఇషాంత్‌ వేషదారణను. కాళ్లకు రంగు షూలతో.. తలకు పచ్చ టోపీతో కాస్త వింతగా కనిపించిన ఇషాంత్‌ను ' లంబూ జీ నీ వేషదారణతో మేము చచ్చిపోయేలా ఉన్నాం.. కాస్త  ఆ గెటప్‌ను మార్చు' అంటూ ట్రోల్‌ చేశాడు.

కాగా ఇటీవలే కివీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన ఇషాంత్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో కివీస్‌ చేతిలో పరాజయం పాలైంది. అయితే ఈ ఓటమిని మరిచిపోయి టీమిండియా నూతనోత్సాహంతో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతుంది. కాగా ఇషాంత్‌ శర్మ కొన్నాళ్లనుంచి కేవలం టెస్టు ఫార్మాట్‌కు పరిమితమయ్యాడు. ఇటీవలే టీమిండియా తరపున 100 టెస్టు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ఆటగాడిగా ఇషాంత్‌ నిలిచాడు. ఓవరాల్‌గా ఇషాంత్‌ శర్మ 102 టెస్టుల్లో 306 వికెట్లు పడగొట్టాడు. ఇక 80 వన్డేల్లో 115 వికెట్లు,  14 టీ20ల్లో 8 వికెట్లు తీసుకున్నాడు.

A post shared by Ishant Sharma (@ishant.sharma29)

మరిన్ని వార్తలు