ఆ నలుగురు నా ఫేవరెట్స్‌.. మరి ఫేవరెట్‌?

13 Aug, 2020 17:47 IST|Sakshi

ఇంటర్నేషనల్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డేపై యువీ

న్యూఢిల్లీ: ప్రపంచ అత్యుత్తమ లెఫ్ట్‌ హ్యాండర్లలో టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఒకడు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాలను భారత్‌కు అందించిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. ఇటీవల తన వీడ్కోలుపై యువీ మాట్లాడుతూ.. రిటైర్మెంట్‌ అనేది సరైన దిశలో సాగకపోవడం బాధించిందన్నాడు. భారత్‌ క్రికెట్‌కు ఎన్నో సేవలందించిన సెహ్వాగ్‌, జహీర్‌ఖాన్‌ వంటి క్రికెటర్లకు కూడా రిటైర్మెంట్‌ అనేది సాధారణంగానే జరిగిపోయిందన్నాడు. ఇక్కడ బీసీసీఐ వ్యవహరించే తీరు దారుణమంటూ విమర్శించాడు. ఆట నుంచి రిటైర్మెంట​ ప్రకటించిన క్రికెటర్లను గౌరవించడంపై బీసీసీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు.(‘ట్రిపుల్‌ సెంచరీ’ హీరోకు కరోనా!)

కాగా, ఆగస్టు 13 అంతర్జాతీయ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ దినోత్సవం సందర్భంగా యువీ ఒక ట్వీట్‌ చేశాడు. తనకు ఇష్టమైన లెఫ్ట్‌ హ్యాండర్ల పేర్లను అభిమానులతో పంచుకున్నాడు. వీరిలో బ్రియాన్‌ లారా(వెస్టిండీస్‌), సౌరవ్‌ గంగూలీ(భారత్‌), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌(ఆస్ట్రేలియా), మాథ్యూ హెడెన్‌(ఆస్ట్రేలియా)లు ఉన్నారు.  నాకు ఇష్టమైన ఈ నలుగురు లెఫ్ట్‌ హ్యాండ్‌ దిగ్గజాలు క్రికెట్‌కు పరిచయం అయినందుకు తానిచ్చే ఇదే గొప్ప నివాళి అంటూ వారి ఫోటోలను షేర్‌ చేశాడు. ఇక మీకు ఇష్టమైన లెఫ్ట్‌ హ్యాండర్‌ ఎవరో తనతో షేర్‌ చేసుకోవాలంటూ పేర్కొన్నాడు. ఎంఎస్‌ ధోని సారథ్యంలో గెలిచిన రెండు వరల్డ్‌కప్‌లు(టీ20 వరల్డ్‌కప్‌, వన్డే వరల్డ్‌కప్‌) యువీ కీలక పాత్ర పోషించాడు. 2007లో జరిగిన వరల్డ్‌కప్‌లో బ్యాట్‌తో మెరిసిన యువీ.. భారత్‌కు కప్‌ గెలవడంలో ప్రధాన భూమిక పోషించాడు.  ప్రత్యేకంగా ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు తన బ్యాటింగ్‌లో పవర్‌ చూపించాడు.

ఇక 2011లో ఆల్‌ రౌండ్‌ షో అదరగొట్టి భారత్‌ వరల్డ్‌కప్‌ గెలవడానికి దోహదపడ్డాడు. అంతకుముందు 2002లో ఇంగ్లండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌లో యువీ తన మార్కుతో ఆకట్టుకుని టైటిల్‌ గెలవడంలో సహకరించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే యువీ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు మరుపురాని విజయాలను అందించి పెట్టాడు. కాకపోతే ఒకానొక సందర్భంలో క్యాన్సర్‌ బారిన పడటంతో యువీ కెరీర్‌ సాఫీగా సాగలేదు. క్యాన్సర్‌తో పోరాడి గెలిచినా మునపటి ఫామ్‌ను అందిపుచ్చుకోవడంలో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. చాలాకాలం పాటు రీఎంట్రీ కోసం ఎదురుచూసినీ యువీకి నిరాశే ఎదురైంది. దాంతో గత సంవత్సరం జూన్‌ 10వ తేదీన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. తన రిటైర్మెంట్‌ను భారంగానే చెప్పిన యువీ.. సీనియర్‌ క్రికెటర్ల రిటైర్మెంట్‌ విషయంలో బీసీసీఐ తీరు సరిగా లేదని మండిపడ్డాడు. (ఈసారి హెలికాప్టర్‌ షాట్లతో పాపులర్‌..!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా