Yuvraj Singh 6 Balls Six Sixes: ఆరు సిక్సర్లు గుర్తున్నాయా?.. రీక్రియేట్‌ చేసేశాడు

21 Sep, 2021 19:32 IST|Sakshi

Yuvraj Singh Six Balls 6 Sixes Recreation.. టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అంటే మొదటగా గుర్తుకువచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. 2007 టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. అంతకముందు ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని బ్రాడ్‌కు చుక్కలు చూపించాడు. బ్రాడ్‌ వేసిన 19 ఓవర్‌లో యువీ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. నేటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా యువీ పేరిటే ఉంది. కాగా ఈ సెప్టెంబర్‌ 19తో యువీ ఇన్నింగ్స్‌ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

చదవండి: యువీ సిక్సర్ల సునామీ.. ఆ విధ్వంసం జరిగి నేటికి 14 ఏళ్లు


టి20 ప్రపంచకప్‌ 2007లో యువీ ఆరు బంతులు ఆరు సిక్సర్లు

తాజాగా యువరాజ్‌ దానిని మరోసారి గుర్తుచేస్తూ తన యూట్యూబ్‌ చానెల్‌లో రిక్రియేట్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశాడు. వీడియో ఓపెన్‌ చేయగానే.. బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న యువీని చూస్తాం. ఇంట్లో కాబట్టి తలకు బండి హెల్మెట్‌ పెట్టుకొని కనిపిస్తాడు. బ్యాట్‌ తీసుకొని గ్రౌండ్‌లోకి ఎంటరవబోతుంటే ఒక వ్యక్తి అడ్డుపడుతాడు. ఏంటి అని అడిగితే.. మీరు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టింది ఈ బ్యాట్‌తోనే అంటూ యువీ ఆ ఇన్నింగ్స్‌ గుర్తుగా దాచుకున్న హీరోహోండా బ్యాట్‌ను చూపించాడు. ఇప్పడు అంత టైం లేదని చెప్పాడు.

చదవండి: INDW VS AUSW: తొలి వన్డేలో టీమిండియా చిత్తు.. ఆసీస్‌ రికార్డు విజయం

కట్‌చేస్తే తన ఇంటి ఆవరణలోని మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో గొడవ పడుతున్నట్లు చూపించాడు. ఆ తర్వాత స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌ వస్తున్నట్లు తనే కామెంటరీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఫ్లింటాఫ్‌తో జరిగిన గొడవను గుర్తు చేస్తూ తాను కొట్టిన ఒక్కో సిక్సర్‌ను చూపించాడు. అలా వీడియో మొత్తంలో ఆరు సిక్సర్లు కొట్టిన విధానాన్ని యాక్టింగ్‌ చేసి చూపించాడు. ఇక చివర్లో ''నా యాక్టింగ్‌ గురించి మీరేమనుకుంటున్నారు.. బాలీవుడ్‌ లెవల్లో ఉందా.. ప్లీజ్‌ కామెంట్‌ చేయండి..'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: Viral Video: ఔటయ్యాననే కోపంతో బ్యాట్‌ విసిరాడు.. అది కాస్తా..

మరిన్ని వార్తలు