'గిల్‌.. ఇదేమైనా క్లబ్‌ క్రికెట్‌ అనుకున్నావా'

5 Dec, 2020 16:55 IST|Sakshi

ముంబై : టీమిండియా​ మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ తోటి క్రికెటర్లను ట్రోల్‌ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. తాజాగా టీమిండియా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను తపదైన శైలిలో ట్రోల్‌ చేశాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ తర్వాత గిల్‌ ఆటకు సంబంధించి కొన్ని ఫోటోస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.  (చదవండి : రిటైర్మెంట్‌ ప్రకటించిన కివీస్‌ స్టార్‌ క్రికెటర్‌)

'దేశానికి ఆడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది ' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. అందులో ఒకటేమో కోహ్లితో కలిసి 56 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఫోటో.. మరొకటి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో సహచర ఆటగాళ్లతో కలిసి దిగిన గ్రూఫ్‌ ఫోటో ఉన్నాయి. అయితే గిల్‌ షేర్‌ చేసిన రెండో ఫోటోలో తన రెండు చేతులను పాకెట్లో పెట్టుకొని కనిపించాడు. ఈ ఫోటోను  తీసుకున్న యూవీ దానిని కాస్త ట్రోల్‌ చేశాడు.

'మహారాజ్‌.. కోహ్లితో కలిసి బ్యాటింగ్‌ చేసిన ఫోటో బాగుంది. కానీ రెండో ఫోటోలో ఏంటి.. ఏదో సాధించినట్లు జేబులో చేతలు పెట్టుకొని నిల్చున్నావు.. ఇదేమైనా గల్లీ క్రికెట్‌ అనుకుంటున్నావా..  నువ్వు  దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు.. అంత రిలాక్సడ్‌గా ఉంటే ఎలా అంటూ ' తనదైన శైలిలో కామెంట్‌ చేశాడు. యూవీ చేసిన కామెంట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి : నటరాజన్‌ రాకతో షమీకి కష్టమేనా)

కాగా శుబ్‌మాన్‌ గిల్‌ ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగి 39 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మూడు టీ20 టోర్నీలో భాగంగా సిడ్నీ వేదికగా టీమిండియా ఆసీస్‌తో ఆదివారం రెండో టీ20లో తలపడనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌ గెలిచిన భారత్‌ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. (చదవండి : క్రికెటర్‌ కాకపోయుంటే రైతు అయ్యేవాడు)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు