ధనశ్రీ వర్మ డ్యాన్స్‌.. చాటుగా ఎంజాయ్‌ చేసిన చహల్‌

25 May, 2021 18:52 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు యజ్వేంద్ర చహల్ ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు కావడంతో ఫ్యామిలీతో కలిసి ఆనందంగా గడుపుతున్నాడు. కాగా ఇటీవలే కరోనా బారీన పడిన చహల్‌ తల్లితండ్రులు కోలుకుంటున్నారు. చహల్‌కు గతేడాది డిసెంబర్‌లో ధనశ్రీ వర్మతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆర్‌సీబీకి మద్దతుగా ఆమె చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేరు. ధనశ్రీ మంచి డ్యాన్సర్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ధన్యశ్రీ డ్యాన్స్ చేస్తుంటే .. చహల్‌ తన పెంపుడు కుక్కతో కలిసి కర్టెన్ వెనుక నుంచి ఆమె డ్యాన్స్‌ చూస్తూ ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు చహల్‌  ఎంపికవలేదు. అయితే  జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా రెండో జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కాగా ఈ పర్యటనకు రాహుల్‌ ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇక చహల్‌ టీమిండియా తరపున 54 వన్డేల్లో 92 వికెట్లు, 48 టీ20ల్లో 62 వికెట్లు తీశాడు.
చదవండి: జడేజా పేసర్‌ అయితే బాగుండు.. మాకు చాన్స్‌ వచ్చేది

డ్యాన్స్‌తో రచ్చ చేసిన చహల్‌ భార్య.. వీడియో వైరల్‌

A post shared by Dhanashree Verma Chahal (@dhanashree9)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు