పేరెంట్స్‌కు కరోనా.. చహల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

15 May, 2021 21:27 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ పేరెంట్స్‌ కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. చహల్‌ తల్లి స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండగా.. అతని తండ్రి పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా చహల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. తన తల్లిదండ్రులు, భార్య ధనశ్రీ వర్మతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫోటోను షేర్‌ చేశాడు.

''మన అనుకున్న వాళ్లు బాగా లేకుంటే అది ఎలా ఉంటుందో నాకు తెలిసింది. మనపై నిజమైన ప్రేమ చూపించేవారు మరింత దగ్గరగా ఉంటారు.'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. కాగా ఇటీవలే ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ చహల్‌ పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించిన చహల్‌ కరోనా సెగతో ఐపీఎల్‌ రద్దు కావడంతో ఇంటికి వచ్చేశాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ 7 మ్యాచ్‌లాడి 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 
చదవండి: అవన్నీ తప్పుడు వార్తలు.. నేను ఎప్పుడు సిద్ధమే: భువీ 
చహల్‌ పేరెంట్స్‌కు కరోనా.. తండ్రి పరిస్థితి సీరియస్‌

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు