ZIM vs IND:'ఓపెనర్‌గా శార్దూల్ వచ్చాడు అనుకున్నా.. ఆటగాళ్లకు సరైన జెర్సీలు లేకుండా పోయాయి'

22 Aug, 2022 18:25 IST|Sakshi

ఇటీవల కాలంలో భారత ఆటగాళ్లు తరచూ తమ సహచరుల జెర్సీలను ధరించడం చూస్తూనే ఉన్నాం. గత నెలలో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దీపక్‌ హుడా ప్రసిద్ధ్‌ కృష్ణ జర్సీని ధరించగా.. మరో ఇద్దరు ఆటగాళ్లు పేసర్‌ ఆర్ష్‌దీప్‌ సింగ్‌ జర్సీ ధరించి కన్పించారు. తాజాగా ఈ జాబితాలోకి వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా చేరాడు.

హరారే వేదికగా జింబాబ్వేతో మూడో వన్డేలో ధావన్‌.. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ జెర్సీని ధరించి బ్యాటింగ్‌ వచ్చాడు. కాగా ఆ జెర్సీపై టేప్‌ అతికించబడి ఉంది. అయిన్పటికీ శార్దూల్ ఠాకూర్  జెర్సీ నంబర్ 54 మాత్రం సృష్టంగా కన్పిస్తోంది. కాగా ఠాకూర్ టీ షర్ట్‌ను ధావన్ ధరించడానికి గల కారణం ఏమిటో మాత్రం ఇప్పటి వరకు తెలియదు. కాగా ఇందుకు సంబంధించిన పోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ క్రమంలో ధావన్‌ జర్సీపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొంత మంది ఫన్నీ కామెట్లు చేస్తుండగా.. మరి కొంత మంది బీసీసీఐ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. "ఓపెనర్‌గా శార్దూల్ వచ్చాడు అనుకున్నా.. ప్రపంచంలోనే ధనిక క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు సరైన జెర్సీలను ఎందుకు అందించలేక పోతుందో అర్ధం కావడం లేదంటూ" కామెంట్‌ చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్‌(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్‌ కిషన్‌(50), ధావన్‌(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్‌ సాధించారు.


చదవండిENG vs PAK: 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. షెడ్యూల్‌ విడుదల చేసిన పాకిస్తాన్‌!

>
మరిన్ని వార్తలు