నేటి నుంచి ‘ఇంటర్‌’ మూల్యాంకనం

20 Mar, 2023 00:24 IST|Sakshi

నెల్లూరు(టౌన్‌): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి నెల్లూరులోని కేఏసీ జూనియర్‌ కాలేజీలో ప్రారంభమవుతుందని ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత సంస్కృతం పేపర్‌ను మూల్యాంకనం చేస్తారన్నారు. ఇంటర్‌ బోర్డు అధికారులు పంపిన ఉత్తర్వుల మేరకు ప్రతి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ తమ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులను ఈ కార్యక్రమానికి పంపాలన్నారు. మొదటి విడత మూల్యాంకనం వచ్చే నెల ఒకటో తేదీ వరకు, రెండో విడత మూడో తేదీ వరకు, మూడో విడత ఐదో తేదీ వరకు, నాలుగో విడత ఎనిమిదో తేదీ వరకు జరుగుతుందన్నారు.

108లో ఈఎంటీ పోస్టుల భర్తీకి చర్యలు

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో అరబిందో ఎమెర్జెన్సీ 108 వాహనాల్లో ఎమెర్జెన్సీ మెడికల్‌ టెక్నీ షియన్లుగా పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని 108, 104 వాహనాల జిల్లా మేనేజర్‌ పవన్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సింగ్‌ గ్రాడ్యుయేషన్‌(జీఎన్‌ఎం, బీఎస్సీ), బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, అనస్తీషియా టెక్నీషియన్‌, 5 సంవత్సరాల అనుభవంతో కూడిన క్యాత్‌ల్యాబ్‌, డిప్లొమో ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ తదితర అర్హతలు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు పెద్దాస్పత్రి ఆవరణలో ఉన్న దిశ పోలీసుస్టేషన్‌ పక్కన గల 108 జిల్లా కార్యాలయంలో తమ జిరాక్స్‌ సర్టిఫికెట్‌లతో దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు. వివరాలకు 83284 61648 అను నంబర్లో సంప్రదించాలని కోరారు.

పొదలకూరు నిమ్మధరలు (కిలో)

పెద్దవి: రూ.75

సన్నవి: రూ.60

పండ్లు: రూ.35

నెల్లూరు పౌల్ట్రీ

అసోసియేషన్‌ ధరలు

బ్రాయిలర్‌ (లైవ్‌) : 95

లేయర్‌ (లైవ్‌) : 75

బ్రాయిలర్‌ చికెన్‌ : 172

బ్రాయిలర్‌ స్కిన్‌లెస్‌ : 192

లేయర్‌ చికెన్‌ : 128

మరిన్ని వార్తలు